విరుచుకుపడే విధ్వంసాలకు విరుగుడు!

ప్రధానాంశాలు

Published : 25/10/2021 04:53 IST

విరుచుకుపడే విధ్వంసాలకు విరుగుడు!

కొండచరియలు విరిగిపడటంపై ముందే హెచ్చరికలు
సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించిన ఐఐటీ మండీ పరిశోధకులు

దిల్లీ: కొండచరియలు విరిగిపడ్డా ప్రాణ, ఆస్తి నష్టాలు ఎక్కువగా సంభవించకుండా నివారించగల సరికొత్త సాంకేతికతను హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఐఐటీ-మండీ పరిశోధకులు ఆవిష్కరించారు. కొండచరియలు విరిగిపడే ముప్పును అది ముందుగానే పసిగట్టి అప్రమత్తం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర సాంకేతికతలతో పోలిస్తే చాలా తక్కువ ధరకే దొరకడం దాని మరో ప్రత్యేకత. ఓ మోషన్‌ సెన్సర్‌ సాయంతో తమ సాంకేతికత పనిచేస్తుందని ఐఐటీ-మండీ పరిశోధకులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు, నేలలో తేమ, మట్టి కదలికల వంటి అన్ని అంశాలను అది ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటుందని చెప్పారు. నేల/మట్టి కదలికలు ఏమాత్రం ఎక్కువగా ఉన్నా.. కొండచరియలు విరిగిపడే ముప్పును పసిగట్టి సంక్షిప్త సందేశాల రూపంలో ఆ విషయాన్ని చేరవేస్తుందని పేర్కొన్నారు. తమ సాంకేతికత కొనుగోలు వ్యయం రూ.80 వేలు మాత్రమేనని పేర్కొన్నారు. కొండచరియలు విరిగిపడే ముప్పును పసిగట్టేందుకు విపణిలో అందుబాటులో ఉన్న ఇతర సాంకేతికతల ధర దాదాపు రూ.2 కోట్ల వరకు ఉందని గుర్తుచేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన