బీఎస్‌ఎఫ్‌ అధికారపరిధిని పెంచడం సరికాదు: మమతా బెనర్జీ

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:19 IST

బీఎస్‌ఎఫ్‌ అధికారపరిధిని పెంచడం సరికాదు: మమతా బెనర్జీ

సిలిగుఢీ: సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. రాష్ట్రాల అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనంటూ ఆరోపించారు. ‘‘బీఎస్‌ఎఫ్‌ అధికార పరిధి సరిహద్దుకు 15 కిలోమీటర్ల పరిధిలోనే ఉండేది. ఇప్పుడు దాన్ని 50 కిలోమీటర్లు చేశారు. దీనిపై మా ఆందోళన తెలుపుతూ కేంద్రానికి లేఖ రాశాం. శాంతిభద్రతలు రాష్ట్రానికి చెందిన అంశం. బీఎస్‌ఎఫ్‌ తనకు కేటాయించిన బాధ్యతలను తాను చూసుకోవాలి. వారికి మా మద్దతు పూర్తిగా ఉంటుంది’’ అని మమత సోమవారం తెలిపారు. పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌, అస్సాంల్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అధికార పరిధిని 50 కిలోమీటర్లకు పెంచుతూ ఇటీవల కేంద్రం బీఎస్‌ఎఫ్‌ చట్టాన్ని సవరించింది. దీంతో ఈ పరిధిలో సోదాలు, అరెస్టులు చేసే అధికారం కూడా బీఎస్‌ఎఫ్‌కు లభించనుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన