సూర్యకాంతితో నీటి నుంచి హైడ్రోజన్‌ తయారీ..

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 10:19 IST

సూర్యకాంతితో నీటి నుంచి హైడ్రోజన్‌ తయారీ..

అత్యంత చౌకైన లోహాల ఉత్పత్తిలో ఐఐటీ గువాహటి ముందడుగు

ఈనాడు, గువాహటి: సూర్యకాంతితో నీటి నుంచి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే అత్యంత చౌకైన లోహాల తయారీకి ఐఐటీ గువాహటి పరిశోధకులు పూనుకున్నారు. శుద్ధ, పునరుత్పాదక ఇంధనాల తయారీకి ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కృషిలో భాగంగా ఐఐటీలోని రసాయన శాస్త్ర విభాగానికి చెందిన బృందం ఈ పరిశోధన చేపట్టింది. దీనికి డాక్టర్‌ మన్మోహన్‌ ఖురేషి నేతృత్వం వహించారు. సౌర ఘటాల(సోలార్‌ సెల్స్‌) ద్వారా కాంతిని విద్యుచ్ఛక్తిగా మార్చే సంప్రదాయ ప్రక్రియతో పాటు సౌరశక్తి ఆధారిత ఇంధనాల తయారీకి ఫొటోఎలెక్ట్రోకెమికల్‌(పీఈసీ) అనే పద్ధతి కూడా ఉందని వారు చెప్పారు. పీఈసీ విధానంలో విద్యుచ్ఛక్తి కలయికతో నేరుగా ఇంధనాలను తయారు చేయొచ్చని తెలిపారు. పీఈసీ ఘటాలు సరళ, సురక్షిత సమ్మేళనాలను వేరుచేయడంలో ఉపకరిస్తాయన్నారు. ఈ విధానంలోనే నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ సమూహాలుగా విడదీయొచ్చని తెలిపారు. ఇంధన సంక్షోభానికి పీఈసీ విధానం ఆచరణాత్మక పరిష్కారం కాదని ఖురేషి చెప్పారు. నీటి ఆక్సీకరణ ప్రక్రియలో మందగమనమే అందుకు కారణమన్నారు. దీన్ని వేగవంతం చేయడానికి ప్లాటినం, ఇరీడియం, రుథేనియం లాంటి ఉత్ప్రేరకాలను వాడొచ్చని, అయితే అవి చాలా ఖరీదైనవని పేర్కొన్నారు. తమ బృందం ఆ లోహాలకు దీటైన సామర్థ్యంతో అతి తక్కువ వ్యయంతో నీటి ఆక్సీకరణకు వినియోగించే ఉత్ప్రేరక లోహాలను(నాన్‌-నోబుల్‌) తయారు చేసిందని తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన