ఇక చౌకలో బయోసెన్సర్లు

ప్రధానాంశాలు

Updated : 26/10/2021 10:03 IST

ఇక చౌకలో బయోసెన్సర్లు

వినూత్న ట్రాన్సిస్టర్లను తయారు చేసిన భారత శాస్త్రవేత్తలు

దిల్లీ: వ్యవసాయ రంగంలోకి ఆధునిక పరిజ్ఞానాన్ని మరింత చేరువ చేసే దిశగా భారత శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వీరు సరికొత్త హై పెర్ఫార్మెన్స్‌ ఆర్గానిక్‌ ఫీల్డ్‌ ఎఫెక్ట్‌ ట్రాన్సిస్టర్ల (ఓఎఫ్‌ఈటీ)ను రూపొందించారు. ఇవి నేల, భూగర్భ జలాల్లో క్రిమిసంహారక మందులు, భార లోహాల స్థాయిని గుర్తించే చౌకైన బయోసెన్సర్ల తయారీకి వీలు కల్పిస్తాయి. దిల్లీలోని శివ్‌నాడర్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఆర్గానిక్‌ ఎలక్ట్రానిక్స్‌ రంగంలో తాము కీలక ముందడుగు వేసి.. ఓఎఫ్‌ఈటీ సెమీ కండక్టర్‌ సాధనాలను రూపొందించామని తెలిపారు. వీటి సాయంతో జీవ, వ్యవసాయ అవసరాల కోసం ఎటుపడితే అటు వంచే వీలున్న ప్రింటెడ్‌ ఎలక్ట్రానిక్‌ బయోసెన్సర్లను అభివృద్ధి చేయవచ్చని చెప్పారు. అవి పంటల నాణ్యతను మెరుగుపరచుకోవడానికి సాయపడతాయని వివరించారు. ఈ ఆర్గానిక్‌ సెమీకండక్టర్లు.. చాలా తక్కువగా విద్యుత్‌ను ఉపయోగించుకుంటాయని తెలిపారు. చౌకైన పదార్థాలతో వీటిని సులువుగా తయారుచేయవచ్చని పరిశోధన బృందానికి నాయకత్వం వహించిన సమరేంద్ర ప్రతాప్‌ సింగ్‌ వెల్లడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన