దేశం, పార్టీకి అంకితమైన భాజపా కార్యకర్తలను తెలపండి

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

దేశం, పార్టీకి అంకితమైన భాజపా కార్యకర్తలను తెలపండి

నమో యాప్‌లో వారి గురించి రాయాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

దిల్లీ: దేశ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి విశేష ఆదరణ లభించడం వెనుక దశాబ్దాల తరబడి కృషి చేసిన పార్టీ కార్యకర్తల త్యాగాలున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుత పార్టీ సభ్యులకు స్ఫూర్తిని రగిలించేలా త్యాగధనులైన అలాంటి కార్యకర్తల గురించి నమో యాప్‌లోని ‘కమల్‌ పుష్ప’ విభాగంలో రాయాల్సిందిగా ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ప్రజల ఆశీస్సులతోనే కేంద్రంలో, వివిధ రాష్ట్రాల్లో సేవలందించే అవకాశం భాజపాకి లభించింది. పార్టీ కోసం, దేశ నిర్మాణం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కార్యకర్తలే దీనికి కారణం’ అని మోదీ ట్వీట్‌ చేశారు. జనసంఘ్‌ రోజుల నుంచి ఇప్పటి వరకూ చిరస్మరణీయమైన కార్యకర్తల గురించి వివరించే అవకాశం కమల్‌ పుష్ప విభాగం కల్పిస్తుందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన