ముంద్రా రేవు డ్రగ్స్‌ కేసులో.. ఎన్‌ఐఏ కస్టడీకి అఫ్గాన్‌ జాతీయుడు

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:50 IST

ముంద్రా రేవు డ్రగ్స్‌ కేసులో.. ఎన్‌ఐఏ కస్టడీకి అఫ్గాన్‌ జాతీయుడు

అహ్మదాబాద్‌: గుజరాత్‌లోని ముంద్రా ఓడరేవులో 2,988 కిలోల హెరాయిన్‌ను గత నెలలో జప్తు చేసిన కేసులో నిందితుడిగా ఉన్న అఫ్గానిస్థాన్‌ జాతీయుడు మొహమ్మద్‌ ఖాన్‌ను స్థానిక ప్రత్యేక కోర్టు మూడు రోజుల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీకి అప్పగించింది. ఇదే డ్రగ్స్‌ కేసులో మరో ముగ్గురు నిందితులు ఎం.సుధాకరన్‌, దుర్గా వైశాలి, రాజ్‌కుమార్‌లను 10 రోజుల పాటు ఎన్‌ఐఏ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఈ నెల 18న ఆదేశాలు జారీ చేసిన సంగతి గమనార్హం.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన