‘పెగాసస్‌’పై నేడు సుప్రీం తీర్పు

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 13:06 IST

‘పెగాసస్‌’పై నేడు సుప్రీం తీర్పు

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై బుధవారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన వాదనలు ఆలకించింది. తుది వాదనలు విన్న అనంతరం తీర్పును వాయిదా వేస్తున్నట్టు సెప్టెంబరు 13న ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించి అక్రమంగా పౌరులపై నిఘా పెట్టిందా? లేదా? అన్న ఒక్క విషయాన్ని మాత్రమే తెలుసుకోనున్నట్టు ధర్మాసనం పేర్కొంది. దీనిపై దర్యాప్తునకు సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తామని కూడా మౌఖికంగా పేర్కొంది. కమిటీ ఏర్పాటుకు సుముఖమేనని ప్రభుత్వం కూడా చెప్పిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ విషయమై సవివరంగా ప్రమాణ పత్రాన్ని సమర్పించలేమని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ కోర్టుకు తెలిపారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన