‘కొవాగ్జిన్‌’పై మరింత సమాచారం అవసరం

ప్రధానాంశాలు

Updated : 27/10/2021 13:25 IST

‘కొవాగ్జిన్‌’పై మరింత సమాచారం అవసరం

డబ్ల్యూహెచ్‌ఓ బృందం నిర్ణయం
అనుమతిపై 3న భేటీ

ఐరాస/జెనీవా: కొవిడ్‌ టీకా కొవాగ్జిన్‌ వినియోగ అనుమతిపై తుది మదింపునకు గాను భారత్‌ బయోటెక్‌ నుంచి ‘అదనపు సమాచారం’ అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సాంకేతిక సలహా బృందం నిర్ణయించింది. ‘‘ఈ వారాంతంలో భారత్‌ బయోటెక్‌ నుంచి అవసరమైన సమాచారం అందుతుందని సాంకేతిక సలహా బృందం భావిస్తోంది. ఈ మేరకు తుది మదింపునకు గాను నవంబరు 3 (బుధవారం)న తిరిగి సమావేశమవుతుంది’’ అని పీటీఐ అడిగిన ఓ ప్రశ్నకు డబ్ల్యూహెచ్‌ఓ మంగళవారం సమాధానం ఇచ్చింది. అయితే అంతకుముందు డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి డాక్టర్‌ మార్గరెట్‌ హారిస్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కొవాగ్జిన్‌కు అత్యవసర అనుమతిపై ఒకటి, రెండు రోజుల్లోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘కొవాగ్జిన్‌’ టీకా అత్యవసర వినియోగ అనుమతికి సిఫార్సు చేసే విషయమై మంగళవారం డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక సలహా బృందం సమీక్ష నిర్వహించింది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన