ఆత్మగౌరవం నిలిచేలా పరిహారం ఉండాలి: సుప్రీం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 04:59 IST

ఆత్మగౌరవం నిలిచేలా పరిహారం ఉండాలి: సుప్రీం

దిల్లీ: ప్రమాదంలో గాయపడ్డవారి ఆత్మగౌరవాన్ని పునరుద్ధరించేలా న్యాయమైన పరిహారాన్ని నిర్ణయించాలని కోర్టులు, ట్రైబ్యునళ్లకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. మోటారు వాహనాల చట్టం సామాజిక సంక్షేమ నిబంధనల్లాంటిదని, దీనిని దృష్టిలో పెట్టుకొని పరిహారాన్ని నిర్ధరించాలని బుధవారం జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ హృషీకేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. ప్రమాదం కారణంగా ఎవరైనా వికలాంగులైతే వారు ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్టేనని పేర్కొంది. వారు దీనస్థితికి దిగజారిపోకూడదని, అందువల్ల గౌరవప్రదమైన జీవితం గడిపేలా పరిహారాన్ని చెల్లించాలని తెలిపింది. కేరళకు చెందిన జితేంద్రన్‌ 2001 ఏప్రిల్‌లో బైకు వెనుకసీటుపై కూర్చొని వెళ్తుండగా కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. 191 రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది. 69 శాతం మేర శాశ్వత వికాలంగుడయ్యాడు. వెనుకసీటుపై ఉన్నాడన్న కారణంతో త్రిస్సూర్‌లోని మోటారు యాక్సిడెంట్‌ క్లెయిమ్స్‌ ట్రైబ్యునల్‌ ఆయనకు రూ.5.74 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో పరిహారాన్ని రూ.9.38 లక్షలకు పెంచింది. తనకు జరిగిన నష్టానికి ఇది సరిపోదని ఆయన సుప్రీంకోర్టులో అప్పీలు చేయడంతో పరిహారాన్ని రూ.27.67 లక్షలుగా నిర్ణయించింది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన