అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:34 IST

అగ్ని-5 క్షిపణి ప్రయోగం విజయవంతం

ఈనాడు, దిల్లీ: ఉపరితలం మీది నుంచి ఉపరితల లక్ష్యాన్ని ఛేదించే అగ్ని-5 బాలిస్టిక్‌ మిసైల్‌ను భారత రక్షణ శాఖ బుధవారం ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌కలాం ద్వీపం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. సాయంత్రం 7.50 గంటల ప్రాంతంలో ఈ ప్రయోగం నిర్వహించినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. త్రీస్టేజ్‌ సాలిడ్‌ ఫ్యూయెల్డ్‌ ఇంజిన్‌ను ఉపయోగించే ఈ మిసైల్‌కు 5వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని అత్యంత స్పష్టతతో విజయవంతంగా ఛేదించే సామర్థ్యం ఉంది. ‘నో ఫస్ట్‌ యూజ్‌’ అన్న భారతదేశ విధానానికి లోబడి భారత్‌ తన శక్తిసామర్థ్యాలను పెంచుకోవడానికి వీలుగా దీన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు రక్షణశాఖ పేర్కొంది.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన