యూపీ ఎన్నికల్లో ఎస్బీఎస్పీతో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు

ప్రధానాంశాలు

Updated : 28/10/2021 10:37 IST

యూపీ ఎన్నికల్లో ఎస్బీఎస్పీతో సమాజ్‌వాదీ పార్టీ పొత్తు

 ఖదేడా హోవే అంటూ ఓటర్లకు పిలుపు

మవూ: ఉత్తర్‌ప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేస్తామని సమాజ్‌వాదీ పార్టీ, సుహేల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ (ఎస్బీఎస్పీ) బుధవారం ప్రకటించాయి. ఈ పార్టీలు రెండూ కలిసి ‘ఖదేడా హోవే’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చాయి. భాజపాను రాష్ట్రం నుంచి ‘తరిమికొట్టడం’ దీని భావమని తెలిపాయి. ఇటీవల జరిగిన పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ‘ఖేలా హోబే’ (ఆట మొదలైంది) నినాదంతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వరుసగా మూడోసారి విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. దీదీలాగే తాము కూడా ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి భాజపాను తరిమికొడతామని ఎస్బీఎస్పీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ తెలిపారు. ‘మా రెండు పార్టీల గుర్తులైన ఎరుపు, పసుపు కలిస్తే.. దిల్లీ, లఖ్‌నవూల్లో ఎవరు లాల్‌-పీలా (ఆగ్రహోదగ్రం) అవుతారన్నది అందరికీ తెలుసు’ అని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన