ఇది ‘పిల్‌’ కాదు...వినతి పత్రం

ప్రధానాంశాలు

Published : 28/10/2021 05:42 IST

ఇది ‘పిల్‌’ కాదు...వినతి పత్రం

 స్వీకరించాలని కేంద్రానికి  దిల్లీ హైకోర్టు ఆదేశం

దిల్లీ: అఫ్గానిస్థాన్‌లో చిక్కుకున్న హిందువులు, సిక్కులను భారత్‌కు రప్పించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యా(పిల్‌)ను బుధవారం దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. దీనిని వినతి పత్రంగా స్వీకరించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.ఎన్‌.పటేల్‌, జస్టిస్‌ జ్యోతి సింగ్‌లతో కూడిన ధర్మాసనం సంబంధిత కేంద్ర ప్రభుత్వ అధికారులకు సూచించింది. భారత, అఫ్గాన్‌లకు చెందిన 227 మంది హిందువులు, సిక్కులు అక్కడ ఉండిపోయారని, వారికి ఈ-వీసాలు ఇప్పించేలా ఆదేశించాలని కోరుతూ సామాజిక కార్యకర్త పరమీందర్‌ పాల్‌ సింగ్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇంతమంది ఉన్నట్టు ఎలా తెలిసిందని ధర్మాసనం ప్రశ్నించగా, తాము నిరంతరం అక్కడి వారితో సంప్రదింపులు జరుపుతున్నట్టు ఆయన తరఫు న్యాయవాది సమాధానమిచ్చారు. ఇది నమ్మశక్యంగా లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అమిత్‌ మహాజన్‌ జోక్యం చేసుకుంటూ అఫ్గాన్‌లో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు నిరంతరంగా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. అయితే వారి పేర్లను వెల్లడించడానికి అధికారులు సుముఖంగా లేరని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన