
ప్రధానాంశాలు
ఐఎన్ఎక్స్ కేసులో చిదంబరం, కార్తీలకు ఊరట
వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు
దిల్లీ: రూ.305 కోట్ల ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం, ఆయన కుమారుడు కార్తీకి దిల్లీ కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి ఒక రోజు మినహాయింపునిచ్చింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాఖలు చేసిన అదనపు అభియోగపత్రాన్ని పరిశీలనలోకి తీసుకున్న కోర్టు ఈ నెల 7న హాజరు కావాల్సిందిగా మార్చి 24న వీరికి ఆదేశాలిచ్చింది. అయితే తాము తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నామని, హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ తండ్రీకొడుకులు తమ న్యాయవాదితో కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక జడ్జి ఎం.కె.నాగ్పాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేశారు.
Tags :
మరిన్ని
జిల్లా వార్తలు
సినిమా
- ప్రముఖ హాస్యనటుడు వివేక్ కన్నుమూత
- ఆ పాత్రలకు.. ఎవరు సరిపోతారా..!
- కొవిడ్.. కొత్తగా!
- Prakash raj: ఒకప్పటి పవన్ వేరు.. ఇప్పుడు వేరు
- social look: అషు ప్రార్థన.. అఖిల్ కొత్తగా..
- విరాళంగా వచ్చిన 15వేల చెక్కులు బౌన్స్!
- WhatsApp: ఈ ‘పింక్’ లింక్ మీకూ వచ్చిందా?
- చివరిసారి సంతోషంగా ఉన్నది అప్పుడే: ధోనీ
- నీ ఆశలన్నీ.. నా శ్వాసలోనే
- ఉదయాన్నే మజ్జిగ తాగండి..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
