close

ప్రధానాంశాలు

Updated : 08/04/2021 05:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లిథియం ఆయాన్‌ బ్యాటరీల సామర్థ్యాన్ని పెంచే సరికొత్త సాంకేతికత

అభివృద్ధి చేసిన ఐఐటీ-గువాహటి పరిశోధకులు

గువాహటి: లిథియం ఆయాన్‌ బ్యాటరీల పనితీరును మెరుగుపరిచే సాంకేతికతను ఐఐటీ-గువాహటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలక్ట్రిక్‌ వాహనాల్లో రీఛార్జి చేసుకునేందుకు ఉపయోగించే బ్యాటరీల సామర్థ్యం ఇక మరింత అధికం కానుందని ఐఐటీ వర్గాలు బుధవారం వెల్లడించాయి. బ్యాటరీలను తక్కువగా, లేదంటే ఎక్కువగా రీఛార్జి చేసినా ఇబ్బందే. అయితే- ‘‘మేము అభివృద్ధి చేసిన తాజా సాంకేతికత ద్వారా బ్యాటరీ ఛార్జి అయిన స్థాయి (ఎస్‌వోసీ)ని కచ్చితంగా అంచనా వేయవచ్చు. బ్యాటరీ టెర్మినల్‌ వోల్టేజి, కరెంటు స్థాయుల ఆధారంగా దీన్ని లెక్కగట్టాం. తద్వారా పరిమితికి మించి బ్యాటరీ ఛార్జి అయినా, దాన్ని తగ్గించవచ్చు. ఎస్‌వోసీ తక్కువ ఉంటే బ్యాటరీని ఇంకా ఎంతవరకూ ఉపయోగించుకోవచ్చన్నది కచ్చితంగా తెలుసుకోవచ్చు’’ అని పరిశోధకులు తెలిపారు. ప్రొఫెసర్లు సోమనాథ్‌ మాఝి, శిశిర్‌కుమార్‌ నాయక్‌, పరిశోధక విద్యార్థి గౌతమ్‌ సేథియాలు ఈ క్రతువులో పాల్గొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన