close

ప్రధానాంశాలు

Updated : 17/04/2021 06:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బొగ్గు కుంభకోణంపై వాదనలకు ఇద్దరు ప్రాసిక్యూటర్ల నియామకం

దిల్లీ: బొగ్గు కుంభకోణంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసులను వాదించడానికి మాచ్కీజీజి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ మణీందర్‌ సింగ్‌, న్యాయవాది రాజేశ్‌ బాత్రాలను ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా నియమిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇంతవరకు ఈ కేసులు వాదించిన ఆర్‌.ఎస్‌.చీమా వృద్ధాప్యం కారణంగా తప్పుకొన్నారు. కుంభకోణంపై 41 కేసులు నమోదు కావడంతో వాటి విచారణకు ఇద్దరు ప్రత్యేక జడ్జీలను కూడా నియమించింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన