close

ప్రధానాంశాలు

Updated : 17/04/2021 06:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

1189 పాజిటివ్‌ కేసుల్లో మూడు దేశాల ఉత్పరివర్తనాలు

కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

దిల్లీ: మన దేశంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో ఇప్పటి వరకు మూడు దేశాలకు చెందిన సార్స్‌ కోవ్‌-2 వైరస్‌ ఉత్పరివర్తనాల (మ్యుటెంట్స్‌)ను గుర్తించినట్లు కేంద ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1189 పాజిటివ్‌ కేసుల్లో విదేశీ రకాలు (వేరియంట్స్‌) నమోదు కాగా వాటిలో 1109 నమూనాల్లో బ్రిటన్‌, 79 నమూనాల్లో దక్షిణాఫ్రికా, ఒక నమూనాలో బ్రెజిల్‌ రకాలకు చెందిన ఉత్పరివర్తనాలు ఉన్నట్లు తేలింది. రెండో దశలో కొవిడ్‌ వేగంగా వ్యాప్తిచెందటానికి ఇవీ కారణమవుతున్నాయి. బ్రిటన్‌ వేరియంట్లు యూకేతో పాటు ఐరోపా, ఆసియా, అమెరికా దేశాల్లో అధికంగా కనిపిస్తున్నాయి. రెండు ఉత్పరివర్తనాలకు (డబుల్‌ మ్యుటేషన్లకు) గురవుతున్న వైరస్‌ రకాలు కూడా ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఐర్లాండ్‌, యూకే, అమెరికాలో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మన దేశంలో వినియోగిస్తున్న ఆర్టీపీసీఆర్‌ పరీక్షల కిట్లు ఈ రకం వైరస్‌లను కూడా నిర్దిష్టంగా గుర్తించగలుతున్నాయని పేర్కొంది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన