close

ప్రధానాంశాలు

Updated : 04/05/2021 04:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పరిగణించాలి

ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ కౌన్సిల్స్‌

దిల్లీ: జర్నలిస్టులను కొవిడ్‌-19పై ముందుండి పోరాడుతున్న యోధులుగా గుర్తించాలని ప్రపంచ దేశాలకు వరల్డ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ప్రెస్‌ కౌన్సిల్స్‌ (డబ్ల్యూఏపీసీ) విజ్ఞప్తి చేసింది. ప్రాధాన్య క్రమంలో వారికి వ్యాక్సిన్‌ అందించాలని, తద్వారా వారు సురక్షితంగా విధులను నిర్వర్తించే వీలుంటుందని పేర్కొంది. వైద్యులు, ఇతర ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల మాదిరే మీడియా సిబ్బంది కూడా కరోనాపై పోరాడుతున్నారని, జర్నలిస్టులకు సాయం అందించేందుకు కలిసి రావాలని ఆయా ప్రభుత్వాలను కోరింది. ‘ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం’ సందర్భంగా డబ్ల్యూఏపీసీ సోమవారం వెబినార్‌ నిర్వహించింది. మహమ్మారి కారణంగా మృతిచెందిన పాత్రికేయులకు నివాళులర్పిస్తూ ఈ సందర్భంగా తీర్మానం చేసింది. ‘ప్రజల వస్తువుగా సమాచారం’ అన్న అంశంపై నార్త్‌ సైప్రస్‌ ప్రెస్‌ కౌన్సిల్‌ ఛైర్‌పర్సన్‌, డబ్ల్యూఏపీసీ ప్రెసిడెంట్‌ సులే ఆర్కే మాట్లాడారు. మహమ్మారి కారణంగా భారత్‌లో ఎంతోమంది పాత్రికేయులు మరణించిన విషయాన్ని గుర్తుచేశారు. కొవిడ్‌ కారణంగా స్థానిక మీడియా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డబ్ల్యూఏపీసీ సెక్రటరీ జనరల్‌ కిశోర్‌ శ్రేష్ఠ ప్రభుత్వాలను కోరారు. కాగా... గత ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది ఏప్రిల్‌ 28 వరకూ దేశ వ్యాప్తంగా 101 మంది జర్నలిస్టులు కొవిడ్‌ కారణంగా మృతిచెందినట్టు దైనిక్‌ భాస్కర్‌ గ్రూపు ఎడిటర్‌ ప్రకాశ్‌ దుబే చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మీడియా సంస్థలు కలిసికట్టుగా ఎలా పనిచేస్తున్నాయన్నది సౌత్‌ ఏషియన్‌ ఫారిన్‌ కరస్పాండెంట్‌ క్లబ్‌ అధ్యక్షుడు మనీష్‌ గుప్తా వివరించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన