ఎన్‌ఎస్‌జీలో తొలి కొవిడ్‌ మరణం
close

ప్రధానాంశాలు

Updated : 06/05/2021 04:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్‌ఎస్‌జీలో తొలి కొవిడ్‌ మరణం

వెంటిలేటర్‌ లేకపోవడంతో కమాండర్‌ మృతిచెందారని ఆరోపణలు

దిల్లీ: దేశంలోని అత్యుత్తమ పోరాట దళాల్లో ఒకటైన ‘నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ)’లో తొలి కొవిడ్‌ సంబంధిత మరణం నమోదైంది. గ్రూప్‌ కమాండర్‌ (సమన్వయం) బి.కె.ఝా కరోనాతో పోరాడుతూ బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 53 ఏళ్లు. గ్రేటర్‌ నోయిడాలోని కేంద్ర సాయుధ పోలీసు బలగాల (సీఏపీఎఫ్‌) ఆస్పత్రిలో వెంటిలేటర్‌తో కూడిన ఐసీయూ పడక అందుబాటులో లేకపోవడం వల్లే ఝా మృతిచెందారని ఎన్‌ఎస్‌జీ అధికారులు ఆరోపించారు. ఆయన్ను వేరే ఆస్పత్రికి మార్చాలని భావించినా.. అవసరమైన సదుపాయాలున్న అంబులెన్సు తగిన సమయంలో రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బిహార్‌కు చెందిన ఝా సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌) నుంచి డిప్యుటేషన్‌ మీద 2018లో ఎన్‌ఎస్‌జీలో చేరారు. ఎన్‌ఎస్‌జీలో పరిపాలనాపరమైన విభాగాల్లో ఇన్నాళ్లూ పనిచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన