నీళ్ల ట్యాంక్‌ కూలి ఏడుగురు చిన్నారులు మృతి
close

ప్రధానాంశాలు

Updated : 09/05/2021 06:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నీళ్ల ట్యాంక్‌ కూలి ఏడుగురు చిన్నారులు మృతి

పెషావర్‌: పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నీళ్ల ట్యాంక్‌ కింద పిల్లలు ఆడుకుంటుండగా.. అకస్మాత్తుగా అది వారిపై కూలింది. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఖైబర్‌ పఖ్తుంఖ్వా రాష్ట్రం మహ్మద్‌ ట్రైబల్‌ జిల్లాలో జరిగింది. చనిపోయిన పిల్లల వయస్సు 4నుంచి 12ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. సహాయ సిబ్బంది మృతదేహాల్ని ట్యాంక్‌ శిధిలాల నుంచి తీశారు. గాయపడ్డ మరో చిన్నారిని ఆసుపత్రికి తరలించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన