AP News: విశాఖ నగరంలో రాజమార్గం!
close

ప్రధానాంశాలు

Published : 15/06/2021 08:47 IST

AP News: విశాఖ నగరంలో రాజమార్గం!

విమానాశ్రయం నుంచి సచివాలయం వరకూ..
ముఖ్యమంత్రి, మంత్రుల ప్రయాణానికి ప్రత్యేక రహదారి
మార్గమధ్యలో విస్తరణకు రూ.100 కోట్లకుపైనే ఖర్చు?

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ నగరాన్ని పరిపాలన రాజధానిగా చేసుకుని ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు చూసేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు విశాఖ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో 2, 3 నెలల్లోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం కావచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగానే పరిపాలన రాజధానిగా నగరానికి మెరుగులు దిద్దేలా మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) కసరత్తు చేస్తోంది. వివిధ పర్యటనల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేక రహదారిని కేటాయించాలని భావిస్తోంది. బోయపాలెం వద్ద ఒక విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి. విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకూ.. ఎన్‌ఏడీ, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా వెళ్లేలా 35 కి.మీ మార్గాన్ని ఎంపిక చేసింది. ఈ మార్గంలో ఎదురయ్యే అడ్డంకుల్ని అధిగమించేలా ప్రణాళిక రచిస్తున్నారు. మరో పక్క ఇటీవల మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో అంతర్గతంగా కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నగరంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. ఇదివరకే జీవీఎంసీ పరిధిలో వివిధ రకాల పనులు చేసిన గుత్తేదారులకు రూ.350 కోట్ల మేర బకాయిలున్నాయి. వీటిని త్వరగా చెల్లించి మౌలికవసతుల పనులకు సహకరించాలని వారిని కోరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

2 కి.మీ మార్గం విస్తరిస్తేనే..

నగరంలో ట్రాఫిక్‌కి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్‌ఏడీ కూడలిలో పైవంతెన పూర్తయింది. ఎన్‌ఏడీ నుంచి హనుమంతవాక వరకు బస్సు శీఘ్ర రవాణా వ్యవస్థ (బీఆర్‌టీఎస్‌) ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కి.మీ రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు సాగలేదు. ఈనెల 16న దీనిపై చర్చించే అవకాశాలున్నాయి. అక్కడి గృహాలకు టీడీఆర్‌ లేదా భూములు ఇవ్వడమా అన్నది యోచిస్తున్నారు. చట్టపరంగా ఓ పరిష్కారానికి రావాలని చూస్తున్నారు. 

తెరపైకి పలు ప్రతిపాదనలు

ప్రస్తుతం అనుకుంటున్న మార్గాన్ని తీర్చిదిద్దడంలో పలు కీలక ప్రతిపాదనలు తెరమీదకి వస్తున్నాయి. వివాదాస్పద 2 కి.మీ బీఆర్‌టీఎస్‌ రోడ్డుతో కలిపి గోపాలపట్నంలోని సింహాచలం ఆర్చి నుంచి అడవివరం కూడలి దాకా 6 కి.మీ మేర మౌలిక వసతుల కల్పనకు యోచిస్తున్నారు. పరిహారం, గృహాల తొలగింపు, విస్తరణ, రోడ్లు, కాలువల నిర్మాణానికి రూ.100 కోట్లకు పైగానే ప్రతిపాదించనున్నారు. త్వరలో టెండర్లకు వెళ్లే ఆలోచన ఉంది. ఇదే మార్గంలో సింహాచలం ఆర్చి సమీపంలో కొండవాలుకు రక్షణగా గోడ నిర్మించనున్నారు.

సీఎం భద్రతా సిబ్బంది పరిశీలన

ఇటీవల ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది నగరానికి వచ్చి విమానాశ్రయం, సచివాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతాల మధ్య మార్గాన్ని పరిశీలించారు. మార్గమధ్యలో రోడ్డుకు ఇరువైపులా కొన్ని మార్పులు చేయాలని సూచించారు. వీరి సూచనలకు అనుగుణంగా జీవీఎంసీ కార్యాచరణ రూపొందిస్తోంది.

బీచ్‌రోడ్డులో ముఖ్యమంత్రి నివాసం

నగరానికి వచ్చాక ముఖ్యమంత్రి నివాసం ఎక్కడుంటుంది అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా బీచ్‌రోడ్డులోని పలు ప్రాంతాల్ని పరిశీలిస్తున్నారు. ఈ ప్రాంతంలో ‘స్మార్ట్‌ సిటీ’లో భాగంగా పూర్తయిన కొన్ని కీలక కట్టడాలు ఉన్నాయి.  వీటితో పాటు ఓ ఫంక్షన్‌ హాలునూ, ఓ అతిథి గృహాన్ని పరిశీలిస్తున్నారు.  



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
    [4] => stdClass Object
        (
            [script_id] => 125
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461508478-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 6
        )

    [5] => stdClass Object
        (
            [script_id] => 126
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461933978-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
            [script_params] => [300, 250]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 7
        )

    [6] => stdClass Object
        (
            [script_id] => 127
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461815444-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
            [script_params] => [300, 600]
            [script_isactive] => 1
            [script_page_type] => Web
            [script_order] => 8
        )

    [7] => stdClass Object
        (
            [script_id] => 149
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615461996658-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
            [script_params] => [336, 280]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 9
        )

    [8] => stdClass Object
        (
            [script_id] => 150
            [script_flag] => DEF
            [script_page] => 47
            [page_div_name] => div-gpt-ad-1615547875330-0
            [script_div_size] => 2
            [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
            [script_params] => [320, 50]
            [script_isactive] => 1
            [script_page_type] => web
            [script_order] => 10
        )

)
మరిన్ని

దేవతార్చన