Bhageerathi Amma: ‘శతాధిక విద్యార్థి’ భాగీరథీ అమ్మ కన్నుమూత

ప్రధానాంశాలు

Published : 24/07/2021 11:53 IST

Bhageerathi Amma: ‘శతాధిక విద్యార్థి’ భాగీరథీ అమ్మ కన్నుమూత

తిరువనంతపురం: వందేళ్ల వయసులోనూ నాలుగో తరగతి పూర్తి చేసి అందరి దృష్టి ఆకర్షించిన కేరళకు చెందిన వృద్ధురాలు భాగీరథీ అమ్మ(107) శనివారం కన్నుమూశారు. వయో సంబంధిత వ్యాధుల కారణంగా గురువారం రాత్రి కొల్లాం జిల్లా ప్రక్కూలంలోని తన నివాసంలో భాగీరథీ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. 105 ఏళ్ల వయసులో నాలుగో తరగతి పరీక్షలు రాసిన భాగీరథీ ఉత్తీర్ణత సాధించారు. వయసుతో సంబంధం లేకుండా చదువుపై శ్రద్ధ చూపిన ఆ వృద్ధురాలికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం అభినందనలు తెలిపారు. ఈమె కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2019కి సంవత్సరానికి నారీశక్తి పురస్కారాన్ని ప్రదానం చేసింది. భాగీరథీ మృతి పట్ల కేరళ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సంతాపం ప్రకటించారు. మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలిచారంటూ కొనియాడారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన