..ఆ ఆస్తుల అమ్మకానికి సన్నాహాలు

ప్రధానాంశాలు

Published : 25/11/2021 09:51 IST

..ఆ ఆస్తుల అమ్మకానికి సన్నాహాలు

దిల్లీ: దేశ విభజన కాలంలో, 1962 చైనా యుద్ధ సమయంలో భారత్‌ను విడిచి పాకిస్థాన్, చైనాలకు తరలి వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందిన వారి ఆస్తుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి సంఘాన్ని పునర్వ్యవస్థీకరించింది. కేంద్ర హోంశాఖ సీనియర్‌ అధికారి అధ్యక్షతన ఈ సంఘం 12,600  స్థిరాస్తులను విక్రయించి దేశ ఖజానాకు రూ.లక్ష కోట్లను జమ చేస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇంతవరకు రూ.2,700 కోట్ల విలువైన  చరాస్తులను అమ్మి భారత సంఘటిత నిధికి జమ చేశారు. స్థిరాస్తి విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. పాకిస్థాన్‌కు వెళ్తూ భారత్‌లో వదలివెళ్లిన ఆస్తులు 12,485 కాగా, చైనా పౌరసత్వం తీసుకున్నవారి ఆస్తులు 126. వీటిలో అత్యధికం ఉత్తర్‌ప్రదేశ్‌ (6,255), పశ్చిమ బెంగాల్‌ (4,088), దిల్లీ (658), గోవా (295), మహారాష్ట్ర (207), తెలంగాణ (158), గుజరాత్‌ (151), త్రిపుర (105), బిహార్‌ (94) రాష్ట్రాలలో ఉన్నాయి. ఉన్నత స్థాయి సంఘానికి అదనపు కార్యదర్శి హోదాగల అధికారి అధ్యక్షత వహిస్తారనీ, వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు చెందిన అయిదుగురు సభ్యులు, ఒక కార్యదర్శి ఉంటారని హోంశాఖ నోటిఫికేషన్‌ తెలిపింది. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన