మార్చురీ మృత్యుంజయుడు.. ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు!

ప్రధానాంశాలు

Updated : 25/11/2021 13:10 IST

మార్చురీ మృత్యుంజయుడు.. ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయాడు!

లఖ్‌నవూ: వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. కొద్ది రోజుల క్రితమే మరణాన్ని జయించిన బాధితుడు.. వైద్యుల పర్యవేక్షణలో ఉండగానే మృత్యు ఒడికి చేరాడు. 4 రోజులు చావుతో పోరాడి కన్నుమూశాడు. శ్రీకేష్‌ కుమార్‌ ఈ నెల 18న రోడ్డుపై వెళ్తుండగా.. ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించగా శ్రీకేష్‌ను పరిశీలించిన వైద్యులు అతడు చనిపోయినట్లు ధ్రువీకరించారు. రాత్రి కావటంతో శవ పరీక్ష ఉదయం నిర్వహిస్తామని చెప్పి భౌతిక ఖాయాన్ని మార్చురీలోని ఫ్రీజర్‌లో ఉంచారు.

ఉదయం శవ పంచనామాకు ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో శ్రీకేష్‌ కదలడం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వైద్యులకు సమాచారం అందించారు. వైద్య సిబ్బంది శ్రీకేష్‌ను మేరఠ్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందించారు. అప్పటి నుంచి చావుబతుకుల మధ్య పోరాడుతున్న శ్రీకేష్‌ మంగళవారం సాయంత్రం మృతిచెందినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శివ్‌ సింగ్‌ వెల్లడించారు. 
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన