IPL 2021:అతడు క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగలడు: ఆశీశ్‌ నెహ్రా 

ప్రధానాంశాలు

Published : 17/09/2021 01:49 IST

IPL 2021:అతడు క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగలడు: ఆశీశ్‌ నెహ్రా 

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చాలా సంవత్సరాలుగా బలంగా కనిపిస్తున్నాయని భారత మాజీ పేసర్ ఆశీశ్‌ నెహ్రా అభిప్రాయపడ్డాడు. ముంబయి ఇండియన్స్ మొదటి నుంచి ఒక బలమైన జట్టును నిర్మించడంపై  దృష్టి పెట్టిందన్నాడు. అందుకే ఇప్పుడు ఆ జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందని పేర్కొన్నాడు. ‘ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు ప్రమాదకరమైన జట్లే. ఈ జట్టును తయారు చేసుకుకోవడానికి ముంబయి చాలా కష్టపడింది. ప్రతి విభాగంలో నాణ్యమైన ఆటగాళ్లు ఉండటం వల్ల బలమైన జట్టుగా తయారైంది. బ్యాట్స్‌మెన్‌లు, స్పిన్నర్లు, పేసర్లు ఇలా అన్ని విభాగాల్లో ముంబయికి మంచి ఆటగాళ్లున్నారు. కాబట్టి ఈ జట్టుతో అన్ని జట్లు జాగ్రత్తగా ఉండాలి’ అని నెహ్రా అన్నాడు.

హార్దిక్‌ పాండ్యాతో నాలుగు ఓవర్లు వేయించకున్నా.. రెండు, మూడు ఓవర్లైనా బౌలింగ్ చేయించాలని నెహ్రా ముంబయి ఇండియన్స్‌కి సూచించాడు.‘ప్రస్తుతం అందరి కళ్లు హార్దిక్ పాండ్యాపైనే ఉన్నాయి. అతనితో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేయించాలని చెప్పను. కీరన్‌ పొలార్డ్, హార్దిక్‌ పాండ్యా చెరో రెండు ఓవర్లు బౌలింగ్‌ చేస్తే జట్టుకు ఎంతో లాభం. హార్దిక్ బ్యాటింగ్‌లో ప్రభావం చూపించగలడు. అతడు గతేడాది తడబడినా.. క్షణాల్లో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగలిగే సత్తా ఉన్న ఆటగాడు. అతడు రాణించాలని ముంబయి ఇండియన్స్‌ కోరుకుంటోంది’ అని ఆశీశ్‌ నెహ్రా వివరించాడు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ రెండో దశ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్‌ తలపడనున్నాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన