close

కథనాలు

Published : 06/04/2021 01:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోండు బెబ్బులి.. షారుక్‌లో పొలార్డ్‌.. తండ్రి కష్టంతో..

* సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సాధన మొదలు పెట్టింది. ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. ‘గోండు బెబ్బులి వాయించడానికి రెడీ అవుతున్నాడు’ అంటూ మనీశ్‌పాండే వీడియోను అభిమానులతో పంచుకుంది.

* మొయిన్‌ అలీ బ్యాటింగ్‌ సాధన మొదలెట్టాడు. అడిలైడ్‌ లెజెండ్స్‌ పుజారా, డుప్లెసిస్‌ ముచ్చట్లు పెట్టారు. చెన్నై సూపర్‌కింగ్స్‌ కొత్త కుర్రాళ్లు హరి, భగత్‌ క్వారంటైన్‌ తొలి రోజు నుంచి సాధన తొలిరోజు వరకు ఎలా గడిచిందో వివరించారు. ఆ జట్టు కోచ్‌లు ఏదో తంత్రం రచిస్తున్నారట! 

* సరిగ్గా వారం రోజుల్లో తమ సారథి టాస్‌ కోసం వెళ్తాడని పంజాబ్‌ కింగ్స్‌ అంటోంది. ‘ఎవరి గురించో బాధపడొద్దు. ఫినిషర్‌ను నేనున్నా’ అని షారుక్‌ ఖాన్‌ బ్యాటింగ్‌ కోచ్‌ జాఫర్‌కు ధీమానిచ్చాడు! షారుఖ్‌లో పొలార్డ్‌ కనిపిస్తున్నాడని కోచ్‌ కుంబ్లే అంటున్నాడు.

* తమ తండ్రి కష్టానికి ఫలితాలను తాను, హార్దిక్‌ అందుకుంటున్నామని కృనాల్‌ భావోద్వేగం చెందాడు. నటాషా, అగస్త్యతో హార్దిక్‌ సమయం ఆస్వాదిస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌ శిబిరం సరదా సరదాగా సాగిపోతోంది.

* షాట్‌ ఓకేనా అని రిషభ్‌ పంత్‌ అంటున్నాడు. షిమ్రన్‌ హెట్‌మైయిర్‌ బ్యాటింగ్‌ మొదలెట్టాడు. రికీ పాంటింగ్‌ క్వారంటైన్‌లో ఉండటంతో జట్టును ఎలా చూసుకున్నారో దిల్లీ క్యాపిటల్స్‌ సహాయ కోచ్‌ ప్రవీణ్‌ ఆమ్రె తెలిపారు.

* 2009లో రాజస్థాన్‌తో జ్ఞాపకాలను పంచుకుంది రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. యుజ్వేంద్ర చాహల్‌ బలాల గురించి ఓ వీడియో పంచుకుంది. మహ్మద్‌ అజహరుద్దీన్‌ స్ట్రెచ్చింగ్‌ చేస్తున్నాడు.

* రాజస్థాన్‌ రాయల్స్‌ కొత్త జెర్సీ ఆవిష్కరణ వీడియో పంచుకుంది. క్వారంటైన్లో ఉన్న జోస్‌ బట్లర్‌ అభిమానులు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు. కుర్రాళ్లు విపరీతంగా సాధన చేస్తున్నారు.

* దినేశ్‌ కార్తీక్‌, ఇయాన్‌ మోర్గాన్‌ తమకిష్టమైన ద్వయం అంటోంది కోల్‌కతా నైట్‌రైడర్స్‌. సందీప్‌ వారియర్‌ పుట్టినరోజు వేడుక జరుపుకొంది. 2019లో చిన్నస్వామిలో ఆండ్రు రసెల్‌ జ్ఞాపకాలు నెమరువేసుకొంది.

 

























ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన