Chennai Super Kings:ధోనీ అద్భుతమైన కెప్టెన్‌: ముత్తయ్య మురళీధరన్‌

ప్రధానాంశాలు

Published : 16/09/2021 15:50 IST

Chennai Super Kings:ధోనీ అద్భుతమైన కెప్టెన్‌: ముత్తయ్య మురళీధరన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ధోనీ అద్భుతమైన కెప్టెన్‌’ అని శ్రీలంక మాజీ స్టార్‌ స్పిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ప్రశంసించారు. ఆయన ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున ధోనీతో కలిసి ఆడిన అనుభవాలను గుర్తుచేసుకొన్నారు. ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు చాలా బాగుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్‌(2008) గురించి మాట్లాడుకుంటే.. టోర్నీలో చాలా సార్లు 200 పరుగుల మార్కును దాటడంతోపాటు ఎక్కువ వికెట్లు తీశారు. కెప్టెన్‌గా ధోనీ చాలా బాగా పనిచేశాడు. అప్పుడు జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లు వారి జాతీయ జట్లలో దిగ్గజ క్రికెటర్లు. ధోనీ ప్రతి ఆటగాడిని అర్థం చేసుకుంటాడు. బలమైన జట్టుని నిర్మించాడు. ఐపీఎల్‌ని ఆస్వాదించాను. ప్రధానంగా నేను వికెట్ల కోసం కాకుండా పరుగులు కట్టడి చేయడానికే ప్రయత్నించాను. ఈ క్రమంలోనే వికెట్లు తీశాను’ అని మురళీధరన్‌ అన్నాడు.

ఐపీఎల్-14 సీజన్‌ రెండో దశ యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య తొలి మ్యాచ్‌ జరగనుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ ధోనీ సారథ్యంలో ఇప్పటికే మూడు సార్లు ఐపీఎల్‌ విజేతగా, ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచింది.  

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన