IPL 2021: అతడిపై ముంబయి ఇండియన్స్‌ ఎక్కువగా ఆధారపడుతోంది

ప్రధానాంశాలు

Published : 17/09/2021 21:07 IST

IPL 2021: అతడిపై ముంబయి ఇండియన్స్‌ ఎక్కువగా ఆధారపడుతోంది

సాబా కరీమ్‌

(Photo: Surya Kumar Yadav Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్‌ సాబా కరీమ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముంబయి ఇండియన్స్‌ అతడి బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతోందని అన్నాడు. ‘సూర్యకుమార్‌ లాంటి ఆటగాడు మూడు లేదా నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడం ముంబయి ఇండియన్స్‌ అదృష్టం. అతడు అవసరమైనప్పుడు బౌండరీలు కూడా బాది ఇన్నింగ్స్‌కు కీలకంగా మారతాడు. ముంబయి అతడి బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడుతోంది. రాబోయే సీజన్లలో ఆటగాళ్లను ముంబయి ఇండియన్స్‌ రిటైన్‌ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఆ జాబితాలో సూర్యకుమార్ పేరు తప్పకుండా ఉంటుంది’ అని సాబా కరీమ్‌ పేర్కొన్నాడు.

‘ఇషాన్‌ కిషన్‌ను టాప్‌ ఆర్డర్‌లో ఆడించాల్సిన అవసరం లేదు. ముంబయి అతడిని నాలుగో స్థానంలో బాగా వినియోగించుకుంటోంది. అలాంటి మార్పులు చేస్తుందని అనుకోవడం లేదు. ఆ జట్టుకు బలమైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది’ అని సాబా కరీమ్‌ అన్నాడు. యూఏఈ వేదికగా మరో రెండు రోజుల్లో ఐపీఎల్-సీజన్ రెండో దశ ప్రారంభంకానుంది. ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్ల మధ్య ఆదివారం తొలి మ్యాచ్‌ జరగనుంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన