Rashmi Gautam: కేటీఆర్‌ను సాయం కోరిన యాంకర్‌ రష్మి!

ప్రధానాంశాలు

Published : 30/07/2021 01:12 IST

Rashmi Gautam: కేటీఆర్‌ను సాయం కోరిన యాంకర్‌ రష్మి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తున్న రష్మి.. జంతు ప్రేమికురాలనే విషయం చాలామందికి తెలిసిందే. మూగ జీవాలకు ఏదైనా హాని జరిగితే ఆమె వెంటనే స్పందిస్తుంది. లాక్‌డౌన్‌లోనూ వీధి కుక్కలు, పావురాల కోసం ప్రతిరోజూ ఆహారం అందించేది. అంతేకాదు.. జంతు పరిరక్షణ కోసం ఆమె ప్రత్యేకంగా పలు అవగాహన కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ వస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మి తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఓ విషయంపై విజ్ఞపన చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో శునకాలకు ఏబీసీ (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారంటూ.. దీనికి ఏదైనా పరిష్కార చర్యలు తీసుకోవాలని ఆమె కేటీఆర్‌ను కోరింది. ఈ మేరకు ఆమె ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ కార్యాలయ ఖాతాతో పాటు కేటీఆర్‌ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ ఓ ట్వీట్‌ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

గతం కొంతకాలంగా హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ఆ శునకాలకు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలేస్తున్నారు. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే విడిచిపెడుతున్నారు. అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా ‘సేవ్‌యానిమల్స్‌ఇండియా’ అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ను చేరుకోవడం కోసం వైద్య సిబ్బంది ఇలా నోరులేని జీవాలను హింసించడం సరికాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కేటీఆర్‌ ఈ విషయంపై ఎలా స్పందిస్తారో చూడాలి..!




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన