close

కథనాలు

Published : 06/04/2021 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పృథ్వీషా విచిత్రమైన థియరీ!

ముంబయి: పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు నెట్స్‌లో సాధన చేసేందుకు పృథ్వీషా ఇష్టపడడని దిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పాడు. బహుశా అతనిప్పుడు తన శిక్షణా పద్ధతులు మార్చుకొని ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశాడు. గత ఐపీఎల్‌ సీజన్లో రెండు అర్ధశతకాలు చేశాక ఫామ్‌ కోల్పోయిన అతడు నెట్స్‌లో సాధనకు రమ్మంటే తిరస్కరించాడని వివరించాడు.

‘గతేడాది అతడి బ్యాటింగ్‌పై విచిత్రమైన వైఖరితో ఉన్నాడు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నప్పుడు అతడు బ్యాటింగ్‌ చేయడు. పరుగులు చేస్తుంటే నిరంతరం బ్యాటింగ్‌ చేస్తూనే ఉండాలని కోరుకుంటాడు. నాలుగైదు మ్యాచుల్లో అతడు పదిలోపే ఔటయ్యాడు. మనం నెట్స్‌లో సాధన చేస్తూ ఎక్కడ తప్పు జరుగుతుందో చూద్దామని చెప్పాను. అప్పుడతను నా కళ్లలోకి చూస్తూ తనకు ఆసక్తిలేదని తేలిగ్గా చెప్పేశాడు’ అని పాంటింగ్‌ అన్నాడు.

‘బహుశా పృథ్వీషా ఇప్పుడు తన వైఖరి మార్చుకొని ఉండొచ్చు. కొన్ని నెలలుగా అతడు బాగా కష్టపడ్డాడు. అతడు అత్యుత్తమంగా ఆడితే సూపర్‌ స్టార్‌ అవుతాడు. అతడిపట్ల నేను కాస్త కఠినంగానే ఉన్నా. నువ్వు నెట్స్‌కి వెళ్లి సాధన చేయాలని గట్టిగా చెప్పాను. నువ్వు చెబుతున్న థియరీ పనిచేయదని చెప్పా. సరైన ఫలితాలు రాకపోతే కోచ్‌గా నేనువాళ్ల సన్నద్ధతను ప్రశ్నించగలను. సాధన చేయాలని చెప్పినా అతడు విన్లేదు. ఫలితంగా పరుగులు చేయలేదు. అతడు వైఖరి మార్చుకుంటే దిల్లీకే కాదు భారత్‌కూ సుదీర్ఘంగా ఆడగలడు. బ్యాక్‌ ఫుట్‌, ఫ్రంట్‌ఫుట్‌ను చక్కగా ఆడతాడు. స్పిన్‌ను దూకుడుగా ఎదుర్కోగలడు’ అని పాంటింగ్‌ వెల్లడించాడు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన