IPL: ఇకనైనా సన్‌‘రైజింగ్‌’ కాకపోతే కష్టమే?
close

కథనాలు

Published : 30/04/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL: ఇకనైనా సన్‌‘రైజింగ్‌’ కాకపోతే కష్టమే?

ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా బరిలోకి దిగి.. మొదట్లో తడబడినా తర్వాత అనూహ్యంగా పుంజుకోని ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లడం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కొత్తేమికాదు. అయితే, ఈ సారి పరిస్థితి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు 6 మ్యాచులు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పరిమితమై ప్లే ఆఫ్స్‌ రేసులో చాలా వెనుకబడి ఉంది. ఇక నుంచైనా సన్‌‘రైజ్‌’ కాకపోతే వార్నర్‌ సేన లీగ్ దశలో ఇంటి ముఖం పట్టే అవకాశముంది.

రైడర్స్‌తో మొదలై..

ఈ సీజన్‌ను సన్‌రైజర్స్‌ ఓటమితో ఆరంభించింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ 10 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా..నితీశ్‌ రాణా 80, రాహుల్‌ త్రిపాఠి 53 పరుగులతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 187 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌..మనీశ్ పాండే 61, బెయిర్ స్టో 55 పరుగులతో రాణించినా సన్‌రైజర్స్‌ 10 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 

బెంగళూరు చేతిలోనూ తప్పలే..

అనంతరం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ సేనకు పరాజయం తప్పలేదు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. విరాట్ కోహ్లి 33, గ్లెన్‌ మాక్స్‌వెల్ 59  పరుగులు చేయడంతో 149 పరుగుల గౌరవప్రదమైన స్కోరును సాధించింది. స్వల్ప లక్ష్యఛేదనకు రంగంలోకి దిగిన సన్‌రైజర్స్‌ బ్యాట్స్‌మెన్‌లో డేవిడ్ వార్నర్ (54), మనీశ్‌ పాండే (38) మినహా అందరూ విఫలమయ్యారు. చివర్లో రషీద్‌ఖాన్ (17) మెరుపులు మెరిపించినా ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓటమి తప్పలేదు. 

పల్టాన్స్‌నూ పడగొట్టాలే..

ముంబయి ఇండియన్స్‌(ముంబయి పల్టాన్స్‌)తో జరిగిన మూడో మ్యాచులో ఆరెంజ్ ఆర్మీ ఆకట్టుకోలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి.. క్వింటన్‌ డికాక్ (40), రోహిత్ శర్మ(32), కీరన్ పొలార్డ్‌(35) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్‌(36), బెయిర్‌ స్టో(43) శుభారంభం అందించారు. ముంబయి కీలక సమయంలో వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను చేజిక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో వార్నర్‌ సేన 137 పరుగులకే కూప్పకూలి హ్యాట్రిక్‌ ఓటములను మూటగట్టుకొంది.

పంజాబ్‌పై తొలి విజయం..

కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా ఉన్న పంజాబ్ కింగ్స్ జట్టును ఓడించి ఈ సీజన్‌ సన్‌రైజర్స్‌ గెలుపు రుచిని చూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌..120 పరుగులకే ఆలౌటైంది. ఖలీల్‌ అహ్మద్‌ 3, అభిషేక్‌ శర్మ 2 వికెట్లతో అదరగొట్టగా.. సిద్ధార్థ్ కౌల్‌, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 121 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌.. డేవిడ్ వార్నర్ (37), బెయిర్ స్టో (63) పరుగులతో రాణించడంతో 18.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఛేదించి తొలి విజయాన్ని నమోదు చేసింది.

సూపర్‌ ఓవర్‌లో బోల్తా..

దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేసిన పంత్ సేన..20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ 7 వికెట్లు నష్టానికి 159 పరుగులే చేసింది. దీంతో సూపర్‌ ఓవర్‌ అనివార్యమైంది. సూపర్‌ ఓవర్‌లో రైజర్స్ జట్టు..7 పరుగులే చేసింది.  8 పరుగుల లక్ష్యాన్ని దిల్లీ క్యాపిటల్స్‌ చివరి బంతికి అందుకుంది.

మళ్లీ పాత కథే..

చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచులోనూ సన్‌రైజర్స్‌కు ఓటమి తప్పలేదు. వార్నర్(57; 55 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడలేకపోయాడు. మనీశ్ పాండే  (61; 46 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌) కాస్త ధాటిగా ఆడాడు. దీంతో  హైదరాబాద్ 171 పరుగులు చేసింది. లక్ష్యఛేదనకు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (75; 44 బంతుల్లో 12 ఫోర్లు), డుప్లెసిస్ (56; 38 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌) అర్ధసెంచరీలు బాదడంతో చెన్నై సునాయసంగా విక్టరీ సాధించింది. ఈ విజయంతో ధోనీసేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి  చేరుకోగా..ఐదో ఓటమిని చవిచూసిన సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 

మిడిల్‌ ఆర్డర్ వైఫల్యం..

సన్‌రైజర్స్‌ టాప్‌ ఆర్డర్‌లో ఒకరు విఫలమైనా మరోకరు రాణిస్తూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెడుతున్నారు. కానీ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్‌ నిలకడగా రాణించకపోవడమే జట్టుకు పెద్ద సమస్యగా మారింది. బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌, దిల్లీ క్యాపిటల్స్‌ జట్లతో జరిగిన మ్యాచ్‌లో మిడిల్‌ ఆర్డర్ వైఫల్యమే మ్యాచ్‌ ఫలితాలపై ప్రభావం చూపింది. ఈ లోపాన్ని సరిదిద్దుకుంటేనే  సమష్టిగా రాణిస్తేనే హైదరాబాద్‌ ఈ సారి ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశముంది. కెప్టెన్‌ వార్నర్ కూడా తనదైన శైలిలో చెలరేగి జట్టుకు భారీ స్కోర్లను అందించాల్సిన అవసరముంది.

ఇంటర్నెట్ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన