అందుకే.. టీ20 క్రికెట్‌ ఫన్నీ గేమ్‌!
close

కథనాలు

Published : 27/10/2020 08:42 IST

అందుకే.. టీ20 క్రికెట్‌ ఫన్నీ గేమ్‌!

కింది జట్ల షాకులు.. డాడీస్‌ వైఫల్యం.. 14లోపు 7 వికెట్లు

టీ20 క్రికెట్‌ ఒక ఫన్నీ గేమ్‌! ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో ఊహించలేం. ఉన్నట్టుండి గెలిచే మ్యాచులో ఓడిపోతారు. ఆఖరి బంతికి 2 పరుగులు తీయలేక సూపర్‌ ఓవర్‌ ఆడేస్తుంటారు. ఇన్నింగ్స్‌ తొలి బంతి నుంచి ఆడే బ్యాటర్‌ ఆఖరి బంతికి క్లీన్‌బౌల్డ్‌ అవుతాడు. అప్పటి వరకు ధారాళంగా పరుగులిచ్చిన బౌలరే‌ చివరి ఓవర్లో హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టి హీరో అవుతాడు. యూఏఈలో జరుగుతున్న లీగులోనూ గత వారం ఇలాంటి గమ్మత్తులు కొన్ని చోటు చేసుకున్నాయి మరి!


షాకిచ్చిన కింది జట్లు‌

ముంబయి, దిల్లీ, బెంగళూరు.. ప్లేఆఫ్స్‌ చేరుకుంటాయనడంలో ఎవరికీ సందేహాల్లేవు. ఎందుకంటే శనివారం ముందునాటికే ఈ జట్లు 10 మ్యాచులాడేసి7 విజయాలు సాధించాయి. 14 పాయింట్లతో సమంగా ఉన్నా రన్‌రేట్‌ను బట్టి 1, 2, 3 స్థానాలను పంచుకున్నాయి. ఇక మిగిలిన 4 మ్యాచుల్లో ఏ ఒక్కటి గెలిచినా 16 పాయింట్లతో ఫ్లేఆఫ్స్‌ బెర్తులు ఖాయం చేసుకుంటాయి. అలాంటి టాప్-3 జట్లకు పట్టికలో కిందవున్న జట్లు ఊహించని రీతిలో షాకిచ్చాయి. ముంబయిని రాజస్థాన్‌, దిల్లీని కోల్‌కతా, బెంగళూరును చెన్నై సునాయసంగా  ఓడించేశాయి. లీగ్‌ను మరింత రసవత్తరంగా మార్చేశాయి.


14 పరుగులకే 7 వికెట్లా?

మొదట్లో వరుస ఓటములతో కలవరపడ్డ పంజాబ్‌ ఇప్పుడు వరుస విజయాలతో అదరగొడుతోంది. హైదరాబాద్‌కు నిర్దేశించిన 127 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంది. ఆఖరి వరకు ఈ మ్యాచులో మలుపులే.. అత్యంత ఉత్కంఠే..  మొదట ఫామ్‌లో ఉన్న రాహుల్‌ విఫలమవ్వడమే అరుదు. ఆపై ఛేదనలో వార్నర్‌ దూకుడుతో 5.2 ఓవర్లకే హైదరాబాద్‌ 50 పరుగులు చేసేసింది. మనీశ్‌ పాండే, విజయ్‌ శంకర్‌ భాగస్వామ్యంతో 16 ఓవర్లకు 99/3తో విజయపుటంచుల వద్ద నిలిచింది. అలాంటిది 14 పరుగుల వ్యవధిలో చివరి 7 వికెట్లు నష్టపోయి వార్నర్‌‌ సేన ఓటమి పాలవ్వడం విచిత్రమే మరి.


‘మాక్సీ’మమ్స్‌ ఎక్కడ?‌

క్రీజులో నిలిస్తే భారీ సిక్సర్లు బాదేసే విధ్వంసకర ఆటగాడు గ్లెన్‌ మాక్స్‌వెల్‌. స్పిన్నా? ఫాస్టా? అని చూడకుండా దంచికొడతాడు. అలాంటిది ఈ సీజన్లో పంజాబ్‌ తరఫున అన్ని మ్యాచులూ ఆడినా ఒక్క సిక్సరూ‌ బాదలేదు. ఎందుకో తనను తాను సంపూర్ణంగా ఆవిష్కరించుకో లేకపోతున్నాడు. నెట్స్‌లో మంచి టచ్‌తో కనిపిస్తున్నా మైదానంలో సింగిల్స్‌కే పరిమితం అవుతున్నాడు. 11 మ్యాచుల్లో 100 బంతులు ఎదుర్కొన్న అతడు చేసింది 102 పరుగులే. కొట్టింది 8 బౌండరీలే. లీగ్‌లో ఇదీ ఓ గమ్మత్తే!


‘డాడీస్‌’ వైఫల్యం

లీగులో ఆడుతోందంటే చాలు కనీసం ప్లేఆఫ్స్‌.. వీలైతే రన్నరప్‌.. కుదిరితే ట్రోఫీ! గతేడాది వరకు మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై పరిస్థితి ఇలాగుండేది. అలాంటిది తొలిసారి ప్లేఆఫ్స్‌ ఆడకుండానే నిష్ర్కమించింది ధోనీసేన. ఆ జట్టుకు 2020 అచ్చిరాలేదు మరి! ముందుండి నడిపించాల్సిన రథసారథికే అయోమయంగా గడిచింది. ఏ మాత్రం ఆత్మవిశ్వాసంతో కనిపించలేదు. అంబటి రాయుడు, డుప్లెసిస్‌ను మినహాయిస్తే మిగతా ‘డాడీ’ ప్లేయర్లంతా విఫలమయ్యారు. సామ్‌ కరన్‌ను మినహాయిస్తే మిగతా కుర్రాళ్లలో కసి కనిపించలేదని స్వయంగా మహీయే చెప్పాడు. కరోనా కష్టాలూ చెన్నైనే వేధించడం బాధాకరం.


సిరాజ్‌ ‘చక్రవర్తి’

బెంగళూరు పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, కోల్‌కతా మిస్టరీ స్పిన్నర్‌ కే చక్రవర్తి తమ బౌలింగ్‌తో అందరినీ సంభ్రమాశ్చర్యాలతో ముంచెత్తారు. కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశారు. సాధారణంగా సిరాజ్‌కు కోహ్లీ కొత్త బంతి ఇవ్వడు. అదేంటో కోల్‌కతా మ్యాచులో ఇచ్చాడు. ఇదే అదనుగా ఈ హైదరాబాదీ కుర్రాడు ఇరగదీశాడు. తొలి రెండు ఓవర్లలో పరుగులేమీ ఇవ్వకుండానే రాహుల్‌ త్రిపాఠి, నితీశ్‌ రాణా, శుభ్‌మన్‌ గిల్‌ను పెవిలియన్‌ పంపించాడు. లీగ్‌లో ఇలాంటి ఘనత నమోదు చేసిన రెండో బౌలర్‌గా అవతరించాడు. 4-2-8-3తో తన స్పెల్ ముగించాడు. ఇక దిల్లీతో మ్యాచులో చక్రవర్తీ ఇలాగే రెచ్చిపోయాడు. 20 పరుగులిచ్చి ఏకంగా 5 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో అత్యుత్తమ గణాంకాలు సాధించాడు. వీరిద్దరూ అంతకు ముందు మ్యాచుల్లో ఎక్కువ పరుగులే ఇవ్వడం గమనార్హం. వీరిద్దరూ పేదరికం నుంచే క్రికెట్లో ఎదిగారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన