UNICEF: 230 కోట్ల మంది చేతుల శుభ్రానికి దూరం: యునిసెఫ్‌

ప్రధానాంశాలు

Updated : 17/10/2021 10:08 IST

UNICEF: 230 కోట్ల మంది చేతుల శుభ్రానికి దూరం: యునిసెఫ్‌

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్ల మంది చేతులను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన కనీస సౌకర్యాలకు నోచుకోవడం లేదని ఐరాస బాలల నిధి సంస్థ (యునిసెఫ్‌) వెల్లడించింది. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లోని పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నట్టు పేర్కొంది. అక్కడ ప్రతి పది మందిలో ఆరుగురికి చేతులను కడుక్కోవడానికి అవసరమైన సబ్బు, నీరు వంటివి అందుబాటులో లేవని వివరించింది. కరోనా వేళ ఈ సమస్య మరింతగా పెరిగినట్టు ఆందోళన వ్యక్తం చేసింది. ‘ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌వాష్‌ డే’ సందర్భంగా యునిసెఫ్‌ తాజా నివేదికను విడుదల చేసింది. 

నివేదిక ఏం చెప్పిందంటే...

* ప్రపంచ వ్యాప్తంగా సుమారు 40% బడుల్లో చేతులు కడుక్కునేందుకు అవసరమైన సబ్బు, నీరు వంటి సదుపాయాల్లేవు. ఫలితంగా 81.80 కోట్ల మంది విద్యార్థులు ప్రభావితమవుతున్నారు.

అంతగా అభివృద్ధి చెందని దేశాల్లోని 70% పాఠశాలల్లో విద్యార్థులు చేతులు కడుక్కోవడానికి చోటే లేదు!

* ప్రపంచంలోని మూడింట ఒక వంతు ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి అవసరమైన సదుపాయాల్లేవు. ఇళ్లలో చేతులను శుభ్రం చేసుకునే సదుపాయం లేనివారు 67 శాతం నుంచి 71 శాతానికి పెరిగారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరినాటికి కూడా సుమారు 190 కోట్ల మందికి చేతులను శుభ్రం చేసుకోవడానికి అవసరమైన సదుపాయాలు దరిచేరవు.




Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన