మహిళలూ! చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు

ప్రధానాంశాలు

Published : 24/10/2021 08:11 IST

మహిళలూ! చీకటి పడ్డాక పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దు

భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మౌర్య

వారణాసి: చీకటి¨ పడ్డాక మహిళలు పోలీస్‌స్టేషన్లకు వెళ్లొద్దని, ఠాణాల వైపు వెళ్లాలంటే కుటుంబంలోని పురుషుల తోడు తీసుకోవడం ఉత్తమమని ఉత్తరాఖండ్‌ మాజీ గవర్నర్‌, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు బేబీరాణి మౌర్య హితవు పలికారు. వారణాసిలోని బజర్‌డీహా ప్రాంత వాల్మీకి బస్తీలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మహిళలనుద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘పోలీస్‌స్టేషన్లలో మహిళా అధికారులు కూడా ఉన్నారు. అయినా సాయంత్రం అయిదు దాటాక అటు వెళ్లాల్సి వస్తే జాగ్రత్త’ అని హెచ్చరించారు. బేబీరాణి వ్యాఖ్యల వీడియోను బీఎస్పీ ఎంపీ కుంవర్‌ దానిశ్‌ అలి ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తూ .. ‘ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హయాంలో పోలీస్‌స్టేషన్లు మహిళలకు ప్రమాదకరంగా మారాయన్న మాట’ అని వ్యాఖ్య జోడించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన