China: చైనా బొమ్మల్లో తీవ్ర హానికర రసాయనాలు

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 10:41 IST

China: చైనా బొమ్మల్లో తీవ్ర హానికర రసాయనాలు

ప్రజలను హెచ్చరించిన అమెరికా

వాటికి భారత్‌లో భారీ డిమాండ్‌

వాషింగ్టన్‌: చైనాలో తయారైన ఆట బొమ్మల్లో తీవ్ర హానికర రసాయనాలు ఉండటాన్ని అమెరికా తీవ్రంగా పరిగణించింది. మేడ్‌-ఇన్‌-చైనా బొమ్మల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆన్‌లైన్‌లో వాటిని కొనుగోలు చేసేముందు అత్యంత జాగ్రత్త వహించాలంటూ తన దేశ ప్రజలను హెచ్చరించింది. అమెరికాలో హాలిడే షాపింగ్‌ ప్రారంభం కావడానికి ముందు చైనా నుంచి పెద్దమొత్తంలో ఆట వస్తువులు దిగుమతి అయ్యాయి. ఆగస్టు 24న బల్టిమోర్‌ పోర్టుకు చేరుకున్న ‘లగోరి 7 స్టోన్స్‌’ ఆట వస్తువులను అమెరికా కస్టమ్స్‌ అండ్‌ బోర్డర్‌ ప్రొటెక్షన్‌ (సీబీపీ) స్వాధీనం చేసుకున్నారు. తర్వాత వాటిలోని కొన్ని వస్తువులను ప్రయోగశాలకు తరలించారు.   ఆ వస్తువుల పైపూతలో సీసం, కాడ్మియం, బేరియం తదితర రసాయనాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు అక్కడి నిపుణులు గుర్తించారు. చైనా నుంచి దిగుమతి  అయ్యే లగోరి 7 స్టోన్స్‌ తదితర ఆట వస్తువులు, బొమ్మలు భారత్‌లో భారీగా అమ్ముడుపోతున్నాయి.




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన