కోల్‌కతాకు రన్‌రేట్‌ గండం..!
close

కథనాలు

Updated : 29/10/2020 14:36 IST

కోల్‌కతాకు రన్‌రేట్‌ గండం..!

ఇలా చేస్తేనే కోల్‌కతా ప్లేఆఫ్స్‌కు..

ఈ సీజన్‌లో ఎవరికీ అర్థం కాని జట్టు ఏదైనా ఉందంటే అది కోల్‌కతానే. అస్థిరత్వానికి మారుపేరులా మారిందా జట్టు. ఓటములకు కారణాలేంటో తెలియక యాజమాన్యమే అయోమయంలో పడిపోయింది. హాట్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన ఈ మాజీ ఛాంపియన్‌కు మొదటి నుంచీ అనూహ్య ఫలితాలే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకూ 12 మ్యాచ్‌లాడిన కోల్‌కతా ఆరు మ్యాచుల్లో గెలిచింది. ప్రస్తుతం 12 పాయింట్లతో పంజాబ్‌తో సమానంగా ఉంది. రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో పాయింట్ల పట్టికలో పంజాబ్‌ కంటే దిగువన ఉండిపోయింది. ఇప్పుటి వరకూ కోల్‌కతాను వెనక్కి లాగుతున్న రన్‌రేట్‌ ఆ జట్టు భవిష్యత్‌ను కూడా నిర్ణయించనుంది. నిజానికి కోల్‌కతాను కాపాడేది రన్‌రేట్‌ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వేధిస్తున్న రన్‌రేట్‌ గండం నుంచి కోల్‌కతా బయటపడాలంటే..?

రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోవాలి..
కోల్‌కతా జట్టు తమ రన్‌రేట్‌ను మెరుగు పరుచుకోవాలంటే పవర్‌ప్లే ఫీవర్‌ నుంచి బయటపడాలి. బ్యాటింగ్‌ పవర్‌ప్లేలో పేలవంగా ఉన్న కోల్‌కతా బ్యాట్స్‌మెన్‌ తమ తీరు మార్చుకోవాలి. బ్యాటింగ్‌లో రక్షణాత్మక ధోరణి వీడి ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడి చేయాలి. పవర్‌ప్లేలో భారీగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాలి. స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో పాటు వికెట్లను కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం. మొదట బ్యాటింగ్‌ అయితే.. ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాలను నిర్దేశించాలి. బౌలర్లు అవతలి బ్యాట్స్‌మెన్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేయాలి. ఒకవేళ ఛేదన అయితే.. వికెట్లు కాపాడుకుంటూ లక్ష్యాన్ని ఛేదించాలి. ఎన్ని వికెట్లు, ఎన్ని పరుగులు తేడాతో గెలిచామన్నదే కోల్‌కతా రన్‌రేట్‌ను నిర్ణయిస్తుంది. కాబట్టి ఇకపై ఆడే రెండు మ్యాచుల్లోనూ భారీ తేడాతో గెలవడం కోల్‌కతాకు అత్యంత కీలకం.

‘4’కు నాలుగు పోటీ
-0.479 ఇది కోల్‌కతా రన్‌రేట్‌. ఒకవేళ కోల్‌కతా రానున్న రెండు మ్యాచుల్లో గెలిస్తే 16 పాయింట్లు వస్తాయి. అయినప్పటికీ ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు అవుతుందన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే.. ఇక్కడ ఇరు జట్ల పాయింట్ల సమానంగా ఉంటే రన్‌రేట్‌ కీలకపాత్ర పోషిస్తుంది. ముందుకెళ్లే జట్టేది? ఇంటికెళ్లే జట్టేదో నిర్ణయించేది నెట్‌ రన్‌రేట్‌ మాత్రమే. ప్లేఆఫ్స్‌ కోసం కోల్‌కతా జట్టు పంజాబ్‌తో పోటీపడుతోంది. గత మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన హైదరాబాద్‌ ఇంకా రేసులోనే ఉంది. రాజస్థాన్‌ కూడా ఉన్నట్లే లెక్క. కాబట్టి ఇప్పుడు కోల్‌కతా నాలుగో స్థానం కోసం పోటీ పడాల్సింది మూడు జట్లతో. ఈ నాలుగు జట్లలో రాజస్థాన్‌ రన్‌రేట్ ‌(-0.505) మరీ ఘోరంగా ఉంది. కానీ, తర్వాతి మ్యాచుల్లో ఆ జట్టు విజృంభిస్తే..? మరో ప్రత్యర్థి హైదరాబాద్‌ (+0.396). ఒకవేళ కోల్‌కతా హైదరాబాద్‌తో సమానంగా పాయింట్లు సాధిస్తే కోల్‌కతాకు నిరాశ తప్పదు. పంజాబ్‌ విషయానికి వస్తే పంజాబ్‌ రన్‌రేట్‌ (-0.049) కూడా కోల్‌కతా కంటే మెరుగ్గానే ఉంది. కాబట్టి కోల్‌కతా రానున్న మ్యాచుల్లో గెలవడమే కాదు భారీ విజయాలు సాధించడం ముఖ్యం.

ఇది గతం కాదు.. 2020
గతంలో 12 పాయింట్లు సాధించిన జట్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లిన సందర్భాలున్నాయి. ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నం. 16 పాయింట్లు సాధించిన జట్లు కూడా ప్లేఆఫ్స్‌లో బెర్తు ఖరారు చేసుకుంటాయన్న నమ్మకం లేదు. ఇది టీ20 క్రికెట్‌. పైగా 2020. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. కోల్‌కతా తన తర్వాతి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది. ఆ తర్వాత రాజస్థాన్‌తో మరో మ్యాచ్‌ ఆడాల్సి ఉంది. ఈ రెండింట్లోనూ గెలిస్తే కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌ అవకాశాలు మెరుగైనట్లే. 

కోల్‌కతా ఏం చేయాలి..?
1. మిగిలిన మ్యాచులన్నింటిలోనూ కోల్‌కతా గెలిచి తీరాలి. అప్పుడు కోల్‌కతాకు 16 పాయింట్లు వస్తాయి. అప్పుడు కూడా రన్‌రేట్‌ కీలకంగా మారుతుంది.
2. ఒక మ్యాచ్‌లో ఓడినా కోల్‌కతాకు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే.. అది ఇతర జట్ల ప్రదర్శన, ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
3. కోల్‌కతా ప్రతి మ్యాచ్‌లోనూ 50+ పరుగుల తేడాతో విజయం సాధించాలి. లేదా.. 5+ వికెట్ల తేడాతో గెలవాలి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 125
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 126
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 127
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461815444-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x600_eenadu_hc
      [script_params] => [300, 600]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

  [7] => stdClass Object
    (
      [script_id] => 149
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615461996658-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_336x280_eenadu_hc
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 9
    )

  [8] => stdClass Object
    (
      [script_id] => 150
      [script_flag] => DEF
      [script_page] => 47
      [page_div_name] => div-gpt-ad-1615547875330-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ADP_41931_320x50_eenadu_HC
      [script_params] => [320, 50]
      [script_isactive] => 1
      [script_page_type] => web
      [script_order] => 10
    )

)
మరిన్ని

దేవతార్చన