
తాజా వార్తలు
ఇంటర్నెట్‌డెస్క్: మన ఇంట్లో చాక్లెట్ ఉంటే దాన్ని తినేవరకు మన మనసు కుదురుగా ఉండదు. మరి ఇంటినే పూర్తిగా చాక్లెట్లతో కడితే.. ఎలా ఉంటుంది? ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇటువంటి ఇల్లునే నిర్మించారు. అంతేకాదు, అందులోని రూఫ్, గోడలు, కిటికీలనే మాత్రమే కాకుండా గడియారం, క్యాలెండర్, పుస్తకాలు వంటి అన్నింటినీ చాక్లెట్లతోనే రూపొందించారు. ఆ ఇంటోకి ప్రవేశిస్తే ఎటుచూసినా అన్నీ చాక్లెట్లతో తయారు చేసినవే కనపడుతాయి. దీన్ని జీన్ లూస్ డెక్లుజీ అనే చాక్లెట్ల తయారీదారుడు నిర్మించాడు. ఈ ఇంటిని గురించి తెలుసుకుంటుంటేనే నోరూరిపోతుంది కదూ.. ఈ చాక్లెట్ ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారా? మీరూ ఈ తీయని ఇంట్లో ఒక్క రాత్రంతా ఉండే అవకాశం ఉంది. ఇందులో ఉండాలని ముచ్చటపడుతున్న చాక్లెట్ ప్రియులు అక్టోబరు 5, 6వ తేదీల్లో Booking.com వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. ఈ చాక్లెట్ ఇంటి గురించి నెటిజన్లు తెగ ఆసక్తి కనబర్చుతున్నారు. దాని ఫొటోలు పోస్ట్ చేస్తూ ఆ ఇంటిని తినేయాలని ఉందని కామెంట్లు చేస్తున్నారు.
నెటిజన్లు ఈ ఇంటిపై చేస్తున్న కామెంట్లలో కొన్ని..
* నేను ఒక్కడినే ఆ ఇంటిని తినేస్తా
* ఆ ఇంట్లో ఉండాలంటే ఎంతో నిగ్రహంతో ఉండాలి
* మధుమేహం లేని వారు మాత్రమే ఆ ఇంట్లోకి వెళ్లాలి
* చిన్న పిల్లలను ఆ ఇంట్లోకి తీసుకెళ్లొద్దు
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- చెప్పేస్తుందేమోనని.. చంపేశారు
- ఏమీ లేని స్థితిని చూసిన వాణ్ని
- 22 ఏళ్లకే ఐపీఎస్ అధికారి..!
- సీఎం సర్.. మా నాన్నకు జీతం పెంచండి!
- నలుదిశలా ఐటీ
- భారతా.. విండీసా.. వరుణుడా.. ఆరంభమెవరిదో?
- స్కైన్యూస్ నుంచి హెచ్‌సీఎల్ సీఈవోగా..
- బాపట్లలో వింత శిశువు జననం
- ఒక కాలు పోయినా.. పాకిస్థాన్‌పై ఆడతా
- కోహ్లీ అరుదైన రికార్డుకు రోహిత్ పోటీ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
