close

తాజా వార్తలు

‘అతడు’గా మారినా ‘ఆమె’కు దక్కని ప్రేమ

 ప్రేయసిని పెళ్లి చేసుకునేందుకు యువతి లింగమార్పిడి

మొహం చాటేసిన ప్రియురాలు కేరళలో విచిత్ర ప్రేమ కథ

‘అతడు’గా మారినా ‘ఆమె’కు దక్కని ప్రేమ

కోజికోడ్‌: ఓ యువతి ప్రేమ కోసం ‘ఆమె’ పరితపించింది. ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలని నిశ్చయించుకుంది. అందుకోసం ఏం చేసేందుకైనా సిద్ధపడింది. ఏకంగా లింగమార్పిడి చేయించుకుంది. పురుషుడిగా మారింది. అయితే, మనసిచ్చిన యువతి ప్లేటు ఫిరాయించడంతో ‘అతడు’గా మారిన ‘ఆమె’కు ప్రస్తుతం కన్నీరే మిగిలింది. ఈ అనూహ్య ప్రేమ వ్యవహారం కేరళలో తాజాగా కలకలం సృష్టించింది. పెరువన్నముళికి చెందిన 23 ఏళ్ల అర్చనా రాజ్‌, వడకరాకు చెందిన 22 ఏళ్ల ఓ యువతి సహోద్యోగులు. వారిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం అర్చన లింగమార్పిడి చేసుకోవాలని సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లుగానే ఈ ఏడాది అక్టోబరు 25న అర్చన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయించుకుంది. పురుషుడిగా మారింది. అందుకు రూ.2 లక్షలకుపైగా ఖర్చయింది. ఇప్పుడు అర్చన పూర్తిగా పురుషుడు. అతడి పేరు దీపు ఆర్‌ దర్శన్‌. అయితే లింగమార్పిడి తర్వాత దర్శన్‌కు ప్రేయసి పెద్ద ఝలక్‌ ఇచ్చింది. అతడితో కలిసి జీవించేందుకు నిరాకరించింది. వేరే పురుషుడితో వివాహానికి ముహూర్తం ఖరారు చేసుకుంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన దర్శన్‌.. కోజికోడ్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటుచేశాడు. తనను ప్రేయసి మోసం చేసిన తీరును వివరించాడు. ఇప్పుడు తాను అందరి దృష్టిలో జోకర్‌గా మారానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులను ఆశ్రయించినా, హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసినా ఫలితం లేకపోయిందని తెలిపాడు. తాను వచ్చే నెల్లో వేరే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు కోర్టుకు, పోలీసులకు ప్రేయసి తెలియజేసిందని చెప్పాడు. ఆమె బలవంతం చేయడం వల్లే తాను లింగమార్పిడి చేసుకున్నానని, ఇప్పుడు మాట తప్పింది కాబట్టి ఆమెపై మోసం కేసు పెడతానని దర్శన్‌ తెలిపాడు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.