
తాజా వార్తలు
ఒక్క రోజే రూ.600 పెరిగిన వెండి ధర
దిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ప్రభావం, దేశీయంగా కొనుగోళ్ల మద్దతుతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. బులియన్ మార్కెట్లో పసిడి ధర రూ.32,500 మార్క్ దాటగా.. వెండి ధర శుక్రవారం ఒక్క రోజే రూ.600 పెరిగింది.
అంతర్జాతీయంగా పసిడి పెట్టుబడులు పెరగడంతో పాటు దేశీయంగా నగల వ్యాపారుల నుంచి బంగారానికి గిరాకీ పెరిగింది. దీంతో శుక్రవారం బులియన్ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.170 పెరిగి రూ. 32,620 చేరింది. అటు వెండి కూడా బంగారం దారిలోనే పయనిస్తోంది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు ఊపందుకోవడంతో కిలో వెండి ధర రూ. 600 పెరిగి రూ. 39,250కు చేరింది.
అంతర్జాతీయంగానూ ఈ లోహల ధరలు స్వల్పంగా పెరిగాయి. న్యూయార్క్ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 1,278.10 డాలర్లు, ఔన్సు వెండి ధర 15.26డాలర్లు పలికింది.
Tags :
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- మృతదేహాల అప్పగింతపై సుప్రీం ఆదేశం
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- క్రికెట్లో అక్రమార్కుల పేర్లు బయటపెడతా
- పాక్‌లోనూ గూగుల్ టాప్-10లో మనోళ్లు
- పాక్‌పై అక్షింతలు వేసిన అమెరికా
- మీ తప్పులను సరిదిద్దేందుకే ఈ బిల్లు: రిజిజు
- పార్టీ వీడను, కానీ: పంకజ ముండే
ఎక్కువ మంది చదివినవి (Most Read)
