close

తాజా వార్తలు

పెద్దయ్యాక ఎవరూ పెళ్లి చేసుకోరని..

చిన్నారి అదనపు వేళ్లను కోసేసిన తల్లి

పెద్దయ్యాక ఎవరూ పెళ్లి చేసుకోరని..

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వా జిల్లాలోని సుందర్‌ దేవ్‌ అనే గ్రామంలో ఓ గిరిజన మహిళ అజ్ఞానం కన్నకూతురి మృతికి కారణమైంది. ఇటీవల ఆమె ఓ ఆడశిశువుకి జన్మనిచ్చింది. అయితే, ఆ పాప చేతులు, కాళ్లకు అదనపు వేళ్లు ఉన్నాయి. దీంతో పెద్దయ్యాక ఆమెను ఎవరూ పెళ్లి చేసుకోరని భయపడిన ఆ తల్లి.. తన పాప అదనపు వేళ్లను కొడవలితో కోసేసింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. ‘ఆ శిశువు డిసెంబరు 22న పుట్టింది. ఆమె చేతులు, కాళ్లకు ఆరేసి చొప్పున వేళ్లు ఉన్నాయి. దీంతో ఆ శిశువు తల్లి తారాభాయి అదనపు వేళ్లను కోసేసి, గాయాలకు ఆవు పేడ రాసింది. అయితే, కొన్ని గంటలకే ఆ శిశువు మృతి చెందింది. అదనపు వేళ్లు ఉంటే పెళ్లి కాదనే మూఢనమ్మకంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది’ అని పోలీసులు తెలిపారు.

ఆ శిశువుకి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారని, తాము వైద్య నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని ఎస్పీ రుచి వర్ధన్ మిశ్రా మీడియాకు తెలిపారు. ఈ కేసులో తారాభాయిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. ఆ గ్రామంలో ప్రసూతి వైద్య సేవలు అందిస్తున్న స్థానిక వైద్య సిబ్బందిపై కూడా చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి శైలేంద్ర తెలిపారు. శిశువు జన్మించిన అనంతరం పాటించాల్సిన ప్రక్రియలను, జాగ్రత్తలను వైద్య సిబ్బంది కూడా విస్మరించారని ఆయన తెలిపారు. ఈ కేసులో వైద్య నివేదిక వచ్చిన తరువాత పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.