
తాజా వార్తలు
ప్రభుత్వ ఉద్యోగాలు ![]() పోస్టులు: సైంటిఫిక్ ఆఫీసర్లు ఖాళీలున్న విభాగాలు: ఇంజినీరింగ్, సైన్స్. అర్హత: బీఈ/ బీటెక్/ బీఎస్సీ(ఇంజినీరింగ్)/ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్, ఎంఎస్సీ, అయిదేళ్ల ఎంటెక్, బీఎస్సీ (టెక్) ఉత్తీర్ణత. వయసు: 26 ఏళ్లు మించకూడదు. ఎంపిక: గేట్-2018/ గేట్-2019 స్కోరు (లేదా) ఆన్లైన్ టెస్ట్, సెలక్షన్ ఇంటర్వ్యూ ఆధారంగా. ఇంటర్వ్యూ తేది: 2019 మే-జూన్లో ముంబయి, హైదరాబాద్లో జరుగుతాయి. దరఖాస్తు: ఆన్లైన్. చివరితేది: జనవరి 31 గేట్-2019 స్కోరు అప్లోడ్ చేయడానికి చివరితేది: ఏప్రిల్ 1 వెబ్సైట్: http://www.barconlineexam.in/ |
ప్రవేశాలు ![]() 1) పీజీ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్మెంట్ (2019-21)(40వ బ్యాచ్) అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. ఎంపిక: ఐఆర్ఎంఏఎస్ఏటీ, గ్రూప్ యాక్టివిటీ, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. క్యాట్-2018, గ్జాట్-2019 స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఐఆర్ఎంఏఎస్ఏటీకి షార్ట్ లిస్ట్ చేస్తారు. 2) ఫెలో ప్రోగ్రామ్ ఇన్ రూరల్ మేనేజ్మెంట్ (18వ బ్యాచ్) అర్హత: ఏదైనా విభాగంలో పీజీ లేదా తత్సమాన డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు జాతీయ స్థాయి పరీక్షల్లో అర్హత సాధించి ఉండాలి. ఎంపిక: ప్రెజెంటేషన్ ఆఫ్ రిసెర్చ్ ప్రపోజల్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్లైన్. చివరితేది: పీజీ ప్రోగ్రాముకు జనవరి 21, ఫెలో ప్రోగ్రాముకు ఫిబ్రవరి 20 వెబ్సైట్: https://www.irma.ac.in/ |
సీడ్యాక్, హైదరాబాద్ ![]() కోర్సు: డిప్లొమా ఇన్ మాడర్న్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎసెన్షియల్స్ కాలవ్యవధి: 5 నెలలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ ఉత్తీర్ణత. దరఖాస్తు: ఆన్లైన్. చివరితేది: జనవరి 13 వెబ్సైట్: http://www.meghsikshak.in/cdac/dmsde |
వాక్ఇన్ ఇంటర్వ్యూ ![]() పోస్టులు: టీచింగ్ ఫ్యాకల్టీ, ఆఫీస్ అసిస్టెంట్లు విభాగాలు: క్యాడ్, వీఎల్ఎస్ఐ, ఎలక్ట్రికల్, ఇంగ్లిష్, మ్యాథమేటిక్స్ తదితరాలు. అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/ బీటెక్, బీకాం/ బీఎస్సీ, ఎంఈ/ ఎంటెక్, ఎంఏ/ ఎంఎస్సీ, అనుభవం. వాక్ఇన్ తేది: జనవరి 5 వేదిక: సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్, బాలానగర్, హైదరాబాద్-500037. వెబ్సైట్: https://www.citdindia.org/ |
మరిన్ని నోటిఫికేషన్లు www.eenadupratibha.net లో |
Tags :