close

తాజా వార్తలు

బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రమోషనల్‌ ఆఫర్లు

ఒంగోలు కర్నూలురోడ్డు, న్యూస్‌టుడే: గ్రేస్‌ పీరియడ్‌- 2(అవుట్‌గోయింగ్‌ కాల్స్‌ నిలిపివేసి ఇన్‌కమింగ్‌ కాల్స్‌ మాత్రమే రావడం)లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రీపెయిడ్‌ వినియోగదారులకు తమ సంస్థ ప్రమోషనల్‌ ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సంస్థ జనరల్‌ మేనేజర్‌ బి.చంద్రసేన్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ‘అదనపు టాక్‌ వ్యాల్యూ ఆఫర్‌’లో.. రూ.110 టాప్‌అప్‌ రీఛార్జ్‌ చేయించుకుని రూ.130 టాక్‌వ్యాల్యూ పొందవచ్చని 90 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ఆఫర్‌ ఫిబ్రవరి 11 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. రూ.150 టాప్‌ఆప్‌ రీఛార్జ్‌తో రూ.180 టాక్‌వ్యాల్యూ పొందవచ్చుని 90 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ఆఫర్‌ మార్చి 14 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.

* స్పెషల్‌ ఓచర్‌ ఆఫర్‌: రూ.51 రీఛార్జ్‌తో 15 రోజుల అపరిమిత కాల్స్‌ సౌకర్యంతో 180 రోజుల జీవితకాల ప్లాన్‌లోకి మారుతుంది. ఫిబ్రవరి 11 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. రూ.298 రీఛార్జ్‌తో 90 రోజుల అపరిమిత కాల్స్‌ సౌకర్యం, 180 రోజుల ప్లాన్‌లోకి మారే ఈ పథకం మార్చి 14 వరకు అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.