
తాజా వార్తలు
దిల్లీ: అతి తక్కువ ధరకే డేటాను అందిస్తూ టెలికం రంగంలోనే సంచలనాలు సృష్టిస్తున్న రిలయన్స్ జియో కొత్త చందాదారుల పొందే విషయంలోను అగ్రస్థానంలోనే నిలిచింది. 2018 నవంబరు నెలలో జియోకు 88.01లక్షల మంది చందాదారులు అదనంగా చేరారు. దీంతో నవంబరు 30 నాటికి రిలయన్స్ జియోకు మొత్తం 27.16లక్షల మంది చందాదారులు ఉన్నట్లు టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) వెల్లడించింది. ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అదనపు చందాదారులు పొందడంలో జియో అగ్రస్థానంలో ఉండగా, బీఎస్ఎన్ఎల్ రెండో స్థానంలో ఉంది.
నవంబరు చివరి నాటికి దేశంలో మొత్తం 117.18కోట్ల మంది మొబైల్ ఫోన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇక బీఎస్ఎన్ఎల్కు అదనంగా 3.78లక్షల మంది చందాదారులు చేరారు. భారతీయ ఎయిర్‌టెల్‌కు 1.02లక్షల మంది కొత్త కస్టమర్లు వచ్చి చేరారు. 2018 డిసెంబరు నెలలో డౌన్లోడ్ స్పీడ్ తగ్గినప్పటికీ ఆ జాబితాలో జియో అగ్రస్థానంలోనే కొనసాగుతోందని ట్రాయ్ ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. డౌన్లోడ్ స్పీడ్ 8శాతం తగ్గి 18.7ఎంబీపీఎస్‌గా నమోదైందని ట్రాయ్ వెల్లడించింది. గత 12 నెలలుగా జియోనే అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కొండముచ్చు మృతితో గ్రామస్థుల కంటతడి
- వెస్టిండీస్ ఘన విజయం
- పునరుజ్జీవనం పొందిన వెనిషియన్ గాజు
- ‘రూలర్’ కొత్త ట్రైలర్ చూశారా
- జపాన్‌లో రానా బర్త్‌డే సెలబ్రేషన్స్
- బిర్యానీ అమ్మవద్దంటూ దళితుడిపై దాడి!
- మృతదేహంతో నడిరోడ్డుపై నరకయాతన
- ‘పౌరసత్వ’ సెగ.. దిల్లీలో ఉద్రిక్తం
- ఉరితీసే అవకాశమివ్వండి.. రక్తంతో లేఖ
- అలా అయితే విసుగొచ్చేస్తుందట!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
