
తాజా వార్తలు
యువకుడు, వివాహిత ఆత్మహత్య
ఇళ్లలో పెళ్లికి ఒప్పుకోరని తెలిసి అఘాయిత్యం
ఘట్కేసర్, న్యూస్‌టుడే: యువకుడి వయసు 26.. అప్పటికే వివాహమైన ఆమె వయసు 40.. వారి పరిచయం ప్రేమకు దారితీసింది.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇళ్లలో ఒప్పుకోరని ఇద్దరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
* ఇన్స్పెక్టర్ రఘువీర్‌రెడ్డి, యువకుడి బంధువుల వివరాల ప్రకారం నగరంలోని పాత అల్వాల్ సింగన్న తోటకు చెందిన మున్న పెంటమ్మ-యాదగిరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కొడుకులు. యాదగిరి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. కూతుళ్లకు వివాహం జరిగింది. పెద్ద కొడుకు మతిస్తిమితం సరిగా లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. పెంటమ్మ ఇళ్లలో పని చేస్తోంది. చిన్న కొడుకు మున్న మల్లేష్(26) ప్రైవేటు సంస్థలో కారు డ్రైవర్. నగరంలోని పేట్‌బషీరాబాద్ సుచిత్రలో నివాసం ఉంటున్న కృష్ణా జిల్లా కైకలూరుకి చెందిన బాలపార్వతి(40)కి కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు పెళ్లి అయింది. కుమారుడు ఇంటర్ చదువుతున్నాడు. పార్వతి ప్రవర్తన సరిగా లేకపోవడంతో భర్త దూరంగా ఉంటున్నాడు. పార్వతి మాత్రం ఇంటి సమీపంలోనే టీ దుకాణం నిర్వహిస్తోంది. ఓసారి మున్న మల్లేష్ పార్వతి టీ దుకాణానికి వెళ్లడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. క్రమక్రమంగా అది ప్రేమ వరకు వెళ్లింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇంట్లో వారికి చెబితే ఒప్పుకోరని.. వివాహం అనంతరం అందరికి దూరంగా ఉండాలి అని అనుకున్నారు. ఘట్కేసర్ మండలం అన్నోజిగూడ రాజీవ్ గృహకల్పకాలనీలో నివాసం ఉంటున్న తన స్నేహితుడిని ఓ ఇల్లు అద్దెకు చూడమని మల్లేష్ అడిగాడు. అతను కాలనీలోని ఓ ఇంటిని అద్దెకు ఇప్పించాడు. ఈనెల 13 తేేదీన మల్లేష్-పార్వతి రాజీవ్‌గృహకల్ప కాలనీకి వచ్చారు. అదే రోజు మల్లేష్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. పోలీసులు ఈనెల 17 తేదీన మల్లేష్‌కు ఫోన్ చేసి రప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మళ్లీ 21వ తేదీన మల్లేష్-పార్వతి ఎవరికి తెలియకుండా ద్విచక్రవాహనంపై రాజీవ్‌గృహకల్పకాలనీలో అద్దెకు తీసుకున్న ఇంటికి వెళ్లారు. చీర సహాయంలో ఇద్దరు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.
తెలిసింది ఇలా...
ఇంట్లో నుంచి భరించరాని వాసన వస్తుండటంతో శనివారం ఉదయం చుట్టుపక్కల ఉన్న వారు కిటికీలు తొలగించి చూశారు. ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలికి చేరుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చారు. యువకుడి మృతదేహం చూసిన బంధువులు రోదించడం అక్కడ ఉన్న వారిని కలిచివేసింది.
డబ్బులు తీసుకువచ్చి..
మల్లేష్ ఇంట్లో ఉన్న బీరువా తాళం పగలుగొట్టి రూ.50 వేలు, అతని ద్విచక్రవాహనం ఆర్సీ తాకట్టు పెట్టి రూ.20 వేలు అప్పు తీసుకున్నాడని బంధువులు తెలిపారు. పార్వతి మృతదేహం అప్పగించేందుకు పోలీసులు ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు. పార్వతి ప్రవర్తన సరిగాలేకపోవడంతో చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్నామని వారు సమాధానమిచ్చారు. దీంతో పోలీసులు ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు.
చిన్నవాడైనా.. పెద్ద దిక్కుగా..
మల్లేష్ ఇంట్లో చిన్నవాడేనా.. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవాడు. ఇటీవలే చెల్లి పెళ్లి చేశాడని బంధువులు తెలిపారు. అందరితో కలిసిమెలసి ఉంటే మల్లేష్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని వాపోయారు. ఇద్దరు పెళ్లి చేసుకుంటే రెండు కుటుంబాల్లోని సభ్యులు, సమాజం ఏం అనుకుంటుందోననే ఉద్దేశంతోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- సినిమా పేరు మార్చాం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
