
తాజా వార్తలు
సికింద్రాబాద్: ఆ బాలిక ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది..ఆ పరిచయం ప్రేమగా మారింది.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. చివరికి పెళ్లికి అంగీకరించకపోగా కులం పేరుతో దూషించిన యువకుడిపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, పోక్సో చట్టం కేసు నమోదు చేసి రిమాండుకు తరలించిన సంఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో వెలుగుచూసింది. గోపాలపురం ఏసీపీ శ్రీనివాసరావు కథనం ప్రకారం...మెట్టుగూడకు చెందిన బాలిక (17)తో అదే ప్రాంతానికి చెందిన సాయికిరణ్ అలియాస్ మున్నా(22)కి 2016లో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో కొన్నాళ్లు ఇద్దరి మధ్య చాటింగ్ జరిగాక నేరుగా కలుసుకున్నారు. నువ్వంటే నాకిష్టం, ప్రేమిస్తున్నానని నమ్మించాడు. అంతటితో ఆగకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పి పలుమార్లు శారరీకంగా లోబరుచుకున్నాడు. కొద్దిరోజులుగా ఆ బాలిక పెళ్లి ప్రస్తావన తీసుకొస్తుంటే ముఖం చాటేయసాగాడు. ఈ నెల 4న పెళ్లి విషయంపై సాయికిరణ్‌ను నిలదీయడంతో సమాధానం చెప్పకపోగా కులంపేరుతో దూషించాడు. ఆ బాలిక తన తల్లితో కలిసి చిలకలగూడ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఏసీపీ ఆదేశాల మేరకు చిలకలగూడ పోలీసులు సాయికిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ యాక్ట్, పోస్కో చట్టం కేసులు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- ఫేస్బుక్ సాయంతో కన్నవారి చెంతకు
- ‘దిశ’ నిందితుల మృతదేహాలు తరలింపు
- సైన్యంలో చేరిన కశ్మీరీ యువత
- ఆదాయపు పన్ను తగ్గిస్తారా?
- ట్రాఫిక్‌లో ఆ పోలీసు ఏం చేశారంటే!
- ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంపు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
