
తాజా వార్తలు
మీ మనసులో మాటలన్నీ విన్నాక... నా మదిలోని మాట మీకు చెప్పాలనిపించింది. ప్రేమికుల రోజు వస్తోంది. గిఫ్ట్‌లు ఏం కొనాలో ఆలోచించేసి ఉంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్‌స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇన్ని చేసే మీరు ప్రేమలో ప్రేమ మాత్రమే ఉంటుందని.. ఈర్ష్య, ద్వేషం, మోసం, కుట్ర, అపార్థం, అపనమ్మకం ఉండవని గుర్తుచేసుకోరా?
నింగికి నేలంటే ప్రేమ... వర్షించి పరిమళాలు అద్దుతుంది.
ప్రేమికులైతే నమ్మకాన్ని వర్షించాలి. బంధం పరిమళిస్తుంది.
నేలకు చెట్టంటే ప్రేమ..నీరిచ్చి పెంచుతుంది.
ప్రేమికులైతే నేనున్నానని భరోసానివ్వాలి. అన్యోన్యం పెరుగుతుంది.
చెట్టుకు మనిషంటే ప్రేమ...ఊపిరి పోస్తుంది.
ప్రేమికులైతే స్వేచ్ఛ గాలులు పీల్చనివ్వాలి. ప్రేమ ప్రాణం పోసుకుంటుంది.
... ఆ ప్రేమ ఎందరో జీవితాలకు ప్రాణం పోస్తుంది. ఎన్నో గమ్యాలు చేరుకొనే మార్గం చూపుతుంది. ఎన్నో లక్ష్యాలకు విజయం అందిస్తుంది.
అదే ఈర్ష్య వర్షిస్తే.. ప్రేమ బలహీనపడుతుంది. మోసం నీరుగా పోస్తే... కన్నీరై విలపిస్తుంది. అపార్థం చొరబడితే.. ఊపిరి ఆగిపోతుంది. ప్రేమ చచ్చిపోతుంది.
అమ్మాయి నచ్చిందంటున్నారు... మీరు ఆమెకు నచ్చాలిగా..!
అబ్బాయి వదిలేశాడంటున్నారు... అతనికొచ్చిన కష్టమేంటో చూసుకోవాలిగా..!
అమ్మాయి మోసం చేసిందంటున్నారు... ఆమె పరిస్థితి అర్థం చేసుకోరా!
అమ్మానాన్నలు ఒప్పుకోవడం లేదంటున్నారు.. అర్థమయ్యేట్లు చెప్పారా!
ప్రేమించడం లేదన్నా ప్రేమించండి. ద్వేషించి యాసిడో, కత్తో ఎత్తకండి.
ప్రేమించే వరకూ ప్రేమించండి... బాధతో నుయ్యో, గొయ్యో చూసుకోకండి.
ప్రేమను ఒప్పుకొనేదాక ప్రేమించండి.. కోపంతో వెళ్లిపోకండి. బంధం తెంచుకోకండి.
ప్రేమిస్తున్నామంటే...ప్రేమ ఇస్తున్నామని... ఇవ్వడానికి ఎవ్వరూ అడ్డు చెప్పరు కదా!
నువ్వు ఇస్తూ పో... ప్రేమే ప్రేమను పుట్టిస్తుంది. బతికిస్తుంది. గెలిపిస్తుంది.
యువతీ, యువకులు ప్రేమించుకుంటారు. వీరిని తల్లిదండ్రులూ ప్రేమిస్తారు. అందరిలోనూ ప్రేమే ఉన్నప్పుడు.. బతకాలి గానీ, చావడం ఏంటి? చంపడం ఏంటి?
చచ్చేదో, చంపేదో అయితే ప్రేమ కాదేమో... దాన్ని ఇంకేమైనా అనాలేమో!
ఇలాంటి ఆలోచనలని ప్రేమ మాత్రం అనకండి... ఎందుకంటే నేను చంపను. చావను.
ప్రాణమవుతాను. ప్రాణం పోస్తాను. ప్రాణంగా బతుకుతాను. బతుకుతూనే ఉంటాను.
బిజినెస్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
