close

తాజా వార్తలు

సమాచారంపై నిఘా కోసం ఫేస్‌బుక్‌లో కొత్త ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: గత సంవత్సరం యూజర్ల సమాచార దుర్వినియోగం పేరిట సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ పెద్ద సంక్షోభమే ఎదుర్కొంది. అప్పట్లో మన దేశంలోనూ సంస్థకు తాఖీదులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో డేటా సంరక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టామంటూ స్వయంగా సంస్థ వ్యవస్థాపకుడు జూకర్‌బర్గ్‌ అనేక సార్లు ప్రకటించారు. అందులో భాగంగా సంస్థ ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. దీని ద్వారా ప్రొఫైల్‌పై  ప్రకటనల కోసం తమ డేటాను ఎలా వాడుకుంటున్నారో యూజర్లు నేరుగా తెలుసుకోవచ్చు. ‘వై అయామ్ ఐ సీయింగ్‌ దిస్‌ యాడ్‌’(Why am I Seeing thid ad?) పేరుతో ఈ ఫీచర్‌ వినియోగదారుల తెరపై ఫిబ్రవరి 28 నుంచి కనిపించనుంది. గతంలో ఈ ఫీచర్‌ ద్వారా ప్రకటన వెనక ఏ కంపెనీలు ఉన్నాయి, ఎలాంటి వారిని చేరాలనే లక్ష్యంతో ప్రకటనలను పబ్లిష్‌ చేస్తున్నారో తెలిసేది. అయితే ఇప్పుడు దానికి తోడు యూజర్ల సమాచారం ఎప్పుడు, ఏ కంపెనీలకు ఇచ్చారు, దాన్ని వాడుకోవడానికి అనుమతులు ఎప్పుడు లభించాయి లాంటి అదనపు సమాచారం సైతం ఈ కొత్త ఫీచర్‌ ద్వారా రానుంది. అంటే కంపెనీలు యూజర్ల డేటాను ఏ తేదీన తమ ‘ఫేస్‌బుక్‌ యాడ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌’కు జత చేశారో కచ్చితంగా తెలియనుంది.

ఫేస్‌బుక్‌ ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సోషల్‌ మీడియా సంస్థ. ప్రకటనల కోసం అనేక కంపెనీలు, ఏజెన్సీలు ఫేస్‌బుక్‌ సమాచారాన్ని వినియోగించుకుంటాయి. అయితే ఇందులో వినియోగదారుల డేటాకు భద్రత లేదన్న వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగా జరిగిందే కేంబ్రిడ్జి ఎనలైటికా ఉదంతం. దీంతో యూజర్ల డేటాను సంరక్షించేందుకు సంస్థ అనేక దిద్దుబాటు చర్యలు తీసుకొంటుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.