close

తాజా వార్తలు

ప్రేమే ప్రాణంగా...!
సమస్యల్లోనూ తోడు నిలిచేదే ప్రేమ. అలా నిలిచిన కథే సచిన్‌ కుమార్‌, భవ్యది. ప్రేమికురాలికి క్యాన్సర్‌ అని తెలిసి వదిలేయలేదు అతను. ధైర్యాన్ని నూరిపోశాడు. కుటుంబానికి అండగా నిలిచాడు. క్యాన్సర్‌ ముప్పును వదిలించి, పెళ్లిచేసుకున్నాడు. చిన్నచిన్న కారణాలకే ఎన్నో జంటలు విచ్ఛిన్నమవుతోన్న ఈ రోజుల్లోవీళ్ల కథ నిజంగానే స్ఫూర్తిదాయకమే.

చిన్‌, భవ్యల ప్రేమకథ కేరళ, పాథుకల్‌ టౌన్‌లో మొదలైంది. సచిన్‌ ఇంటర్‌ తరువాత నిలంబూర్‌లో అకౌంటెన్సీ కోర్సులో చేరాడు. అక్కడే అతడికి భవ్య పరిచయమైంది. తక్కువ సమయంలోనే స్నేహితులయ్యారు. ఆరు నెలల తరువాత ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేశాడు అతను.కొన్నాళ్ల తరువాత సరేనంటూ ఆమోదాన్ని తెలిపింది. కొన్నిరోజులకు ఈ జంటను చూసిన భవ్య తల్లిదండ్రులు ఆమెతో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. సచిన్‌ పరిస్థితీ అంతే.

నాలుగో దశలో: తమ కోర్సు అయిపోగానే భవ్య ఒక ఇనిస్టిట్యూట్‌లో ఉద్యోగానికి చేరింది. కొన్నిరోజులకే వెన్నునొప్పి మొదలైంది. రెండు వారాలు చికిత్స తీసుకుంది. ఎంతకీ నొప్పి తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతోంటే అనుమానం వచ్చి స్కానింగ్‌ తీయించారు. ఆ రిపోర్టులో ఎముక మీద చిన్న కంతి కనిపించింది. మళ్లీ పరీక్షలు చేయించుకుంటే ఎముక క్యాన్సర్‌ నాలుగో దశలో ఉంది.

డబ్బు సమకూర్చాడు: ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కీమోథెరపీ చేయాలన్నారు వైద్యులు. ఆమె కుటుంబ సభ్యులకు ఇది తలకు మించిన భారమే. దాంతో సచిన్‌ తన ప్రేమను దక్కించుకోవాలనుకున్నాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్నేహితుల సాయం తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. కీమోథెరపీకి కావాల్సిన డబ్బును సమకూర్చే పనిలో పడ్డాడు. 2018, మార్చి 21న ఆమెకు మొదటిసారి కీమో చేశారు. రేడియేషన్‌ ప్రభావం వల్ల ఆమె జుట్టంతా ఊడిపోయింది. చికిత్సకు ముందు గుండు చేయించుకుంది. ఆ సమయంలో ఆమెకు అండగా, తోడుగా ఉన్నాడు సచిన్‌. ‘క్యాన్సర్‌ వల్లే నాకు ఆమెను నేను ఎంత ప్రేమిస్తున్నానో తెలిసింది’ అని అంటాడతను. రోజుకూలీకి వెళ్లి కూడా ఎంతో కొంత డబ్బు సంపాదించేవాడు. ఎంత కష్టమైనా సరే... ప్రేయసిని కాపాడుకోవాలనుకున్నాడు. స్నేహితుల సాయంతో  సోషల్‌ మీడియాలో తన కథను పంచుకుని అవసరమైన డబ్బును సమకూర్చుకున్నాడు. అయిదు నెలల్లో ఆరుసార్లు కీమో చికిత్సలు జరిగాయి. అన్నింటినీ అతనే చేయించాడు. చివరకు ఇరు కుటుంబాల సమక్షంలో కిందటి నవంబరులో వాళ్ల పెళ్లి అయ్యింది. అది జరిగిన కొన్నాళ్లకు శస్త్ర చికిత్స చేసి వెన్నుముకపై ఉన్న కంతిని విజయవంతంగా తొలగించారు. ఆ అమ్మాయికి దాదాపు పదమూడు కీమోలు జరిగాయి. మరో మూడు అయితే... క్యాన్సర్‌ ప్రమాదం నుంచి బయటపడినట్లే అని అన్నారు వైద్యులు. ఇప్పుడు సచిన్‌ ఆ పనిలో ఉన్నాడు. ‘వందశాతం ఈ జబ్బు నయమవుతుందని ఎవరూ హామీ ఇవ్వలేరు. మరో అయిదారేళ్లలో ఇది తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలా రాకుడదని మేం దేవుడిని ప్రార్థిస్తున్నాం’ అని అంటాడు సచిన్‌ ప్రేమ నిండిన హృదయంతో.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.