Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 57209
            [news_title_telugu_html] => 

పన్ను ప్రణాళిక.. చేయొద్దు పొరపాటు..

[news_title_telugu] => పన్ను ప్రణాళిక.. చేయొద్దు పొరపాటు.. [news_title_english] => Tax Planning Financial Year Tax Saving Investment Growth Equity siri [news_short_description] => ఆర్థిక సంవత్సరం చివరకు వస్తుంటేనే.. పన్ను ఆదా కోసం ఆలోచించే వారి హడావుడి పెరుగుతుంది. ఏం చేయాలి? ఎక్కడ మదుపు చేయాలి? ఎంత కాలం కొనసాగాలి ఇలాంటి అనేక ఆలోచనలతో సతమతమవుతుంటారు. [news_tags_keywords] => Tax Planning, Financial Year, Tax Saving, Investment, Growth, Equity, siri [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-17 00:37:20 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పన్ను ప్రణాళిక.. చేయొద్దు పొరపాటు.. - Tax Planning Financial Year Tax Saving Investment Growth Equity siri - EENADU
close

తాజా వార్తలు

పన్ను ప్రణాళిక.. చేయొద్దు పొరపాటు..

ర్థిక సంవత్సరం చివరకు వస్తుంటేనే.. పన్ను ఆదా కోసం ఆలోచించే వారి హడావుడి పెరుగుతుంది. ఏం చేయాలి? ఎక్కడ మదుపు చేయాలి? ఎంత కాలం కొనసాగాలి ఇలాంటి అనేక ఆలోచనలతో సతమతమవుతుంటారు. ముందు నుంచీ తగిన ప్రణాళిక లేకపోవడంతో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది పన్ను ఆదా చేసుకునే తొందరలో ఏ మాత్రం అనుకూలంగాని పథకాలను ఎంచుకుంటారు. పన్ను ఆదా విషయంలో సాధారణంగా చేసే పొరపాట్లు.. వాటిని ఎలా నివారించాలో చూద్దామా!

 

* పెట్టుబడి వృద్ధి: ప్రతి పెట్టుబడి పథకానికీ ఒక లక్ష్యం ఉండాలి. మంచి రాబడి, వృద్ధి సాధించాలి. పన్ను ఆదా కోసం ఎంచుకునే పథకాలూ ఇందుకు మినహాయింపేమీ కాదు. చాలామంది ఈ విషయాన్ని విస్మరిస్తుంటారు. పన్ను ఆదాతోపాటు, పెట్టిన పెట్టుబడి వృద్ధి సాధించేలా ఉండాలి. మన ఆర్థిక లక్ష్యాల సాధనకు అవి ఉపయోగపడేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

 

అత్యవసర నిధితో: చివరి నిమిషంలో పన్ను ఆదా కోసం పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు డబ్బుకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఒకేసారి చేతిలో అంత డబ్బు ఉండకపోవచ్చు. ఇలాంటప్పుడు చాలామంది తమ దగ్గరున్న అత్యవసర నిధిని ఇందుకోసం వినియోగిస్తారు. ఆర్థిక ప్రణాళికలో అత్యవసర నిధి ఉండటం ఎంతో అవసరం. దాన్ని ఇలాంటి పన్ను ప్రణాళిక పథకాల్లో పెట్టుబడి పెట్టినప్పుడు, చేతిలో డబ్బు ఉండదు. ఫలితంగా అనుకోని ఖర్చు ఎదురయినప్పుడు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి, సాధ్యమైనంత వరకూ ఈ నిధితో పెట్టుబడులు పెట్టకపోవడమే ఉత్తమం.

 

* వైవిధ్యంగా: పన్ను ఆదా కోసం అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటినీ పట్టించుకోకుండా.. పన్ను మినహాయింపు కోసం అవసరమైన మొత్తాన్ని ఒకే పథకంలో మదుపు చేస్తుంటారు చాలామంది. పెట్టుబడులకు సంబంధించినంత వరకూ ఇది పెద్ద పొరపాటు. పెట్టుబడులు వైవిధ్యంగా ఉన్నప్పుడే నష్టభయం తగ్గుతుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. పెట్టుబడి పెట్టే మొత్తం వీలైనంత వరకూ పలు పథకాలకు కేటాయించడం మేలు.

 

* బీమా పెట్టుబడి కాదు..: పన్ను ఆదా పథకాల్లో పెట్టుబడి అనగానే చాలామందికి జీవిత బీమా పాలసీలే గుర్తుకు వస్తాయి. నిజానికి బీమా పెట్టుబడి కాదు. ఆర్థిక ప్రణాళికలో అతి ముఖ్యమైంది. పన్ను ఆదా కోసం దీన్ని పరిశీలించడం కాదు.. దీన్ని ఎంచుకోవడం ద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది అన్నది గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా సంప్రదాయ బీమా పథకాలను పన్ను ఆదా కోసం ఎంచుకోవడం ఏమాత్రం సరైన విధానం కాదు. మీ వార్షికాదాయానికి తగ్గట్టు బీమా పాలసీ మొత్తాన్ని నిర్ణయించుకోండి. చెల్లించిన ప్రీమియానికి పన్ను మినహాయింపు లభించడం ఒక అదనపు వెసులుబాటు మాత్రమే.

 

* ఒక్కసారే కాదు: యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు, ఎండోమెంట్‌ పాలసీలాంటివి ఎంచుకున్నప్పుడు వాటిలో దీర్ఘకాలం కొనసాగాల్సి ఉంటుంది. ఈ ఒక్కసారి చెల్లించేద్దాం.. అంటే కుదరదు. వచ్చే సంవత్సరం సంగతేమిటి? మీరు ఆ ప్రీమియాలను చెల్లించే పరిస్థితిలో ఉంటారా? అంచనా వేసుకోవాలి. ఒక ఏడాది ప్రీమియం చెల్లించి ఆపేస్తే.. ఆ ప్రీమియం కొంత నష్టపోవాల్సి వస్తుంది.

 

* వ్యవధి: పన్ను ఆదా పథకాల్లో మదుపు చేసినప్పుడు వాటికి నిర్ణీత వ్యవధి ఉంటుంది. దాన్ని పరిశీలించకుండా మదుపు చేయకూడదు. యులిప్‌, పీపీఎఫ్‌, ఎండోమెంట్‌ పాలసీలు ఎంచుకున్నపున్పడు వాటిలో దీర్ఘకాలం కొనసాగాల్సి వస్తుంది. అంతకాలం అందులో క్రమం తప్పకుండా మదుపు చేస్తుండాలి. తక్కువ వ్యవధి ఉండే పథకాలను ఎంచుకోవడమే ఉత్తమం.

 

* 80సీకి మించి..: చాలామంది పన్ను ఆదా కోసం సెక్షన్‌ 80సీ గురించే ఆలోచిస్తుంటారు. వీటితోపాటు సెక్షన్‌ 80 డీ (మెడిక్లెయిం), సెక్షన్‌ 80జీ (విరాళాలు), సెక్షన్‌ 80సీసీడీ (నేషనల్‌ పెన్షన్‌ స్కీం).. ఇలాంటి వాటినీ పరిశీలించాలి. 
ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించకూడదు అనుకుంటూ.. అనవసరమైన పథకాలు, మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చని వాటిలో మదుపు చేయడం ఎప్పుడూ సరికాదు. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే పన్ను ప్రణాళికలను కూడా ప్రారంభిస్తే.. ఎలాంటి పొరపాట్లకూ తావుండదు. పైగా దీర్ఘకాలిక ప్రయోజనమూ అందుతుంది.

* ఈక్విటీల్లో: స్వల్పకాలంలో ఈక్విటీ మార్కెట్లో కాస్త ఆటుపోట్లు ఉంటాయి. కానీ, దీర్ఘకాలంలో ఇవి మంచి రాబడిని అందిస్తాయి. వీటికి దూరంగా ఉండటంటే అంటే.. దీర్ఘకాలంలో సంపదను సృష్టించుకునేందుకు ఉన్న అవకాశాలను కోల్పోతున్నట్లే లెక్క. ఈక్విటీల్లో మదుపు చేయడం ద్వారా పన్ను ఆదాకు అవకాశం కల్పించేవి.. ఈఎల్‌ఎస్‌ఎస్‌లు (ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీం). వీటిలో ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే సిప్‌ ద్వారా పెట్టుబడి పెట్టడం వల్ల సగటు ప్రయోజనాన్ని పొందవచ్చు. పైగా వీటిలో మూడేళ్లపాటు కొనసాగితే చాలు. క్రమానుగత పెట్టుబడికి అవకాశం కల్పించే ఈ పథకాలతో మంచి రాబడికీ అవకాశం ఉంటుంది.

 - శ్యామలీ బసు 
సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హెచ్‌డీఎఫ్‌సీ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.