close

తాజా వార్తలు

మార్కెట్లోకి కేటీఎం 250 డ్యూక్‌ ఏబీఎస్‌ విడుదల

ముంబయి: కేటీఎం 250 డ్యూక్‌ మోడల్‌ను అప్‌డేట్‌ చేసింది. సరికొత్త యాంటీ లాక్ ‌బ్రేకింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఇప్పటికే కేఈటీఎం పలు మోడల్స్‌లో దీనిని ఏర్పాటు చేసింది. ఇప్పుడు 250 మోడల్‌లో కూడా అందుబాటులోకి తేవడంతో మొత్తం కేటీఎం బైకుల మోడళ్లలో ఈ వ్యవస్థ వచ్చినట్లైంది. సరికొత్త కేటీఎం 250 డ్యూక్‌ ధర (ఎక్స్‌షోరూం) రూ.1.94లక్షలుగా నిర్ణయించారు. మార్చి 31లోపు 125సీసీ దాటి ఉంటే మోటార్‌ సైకిళ్లలో ఈ ఫీచర్‌ తప్పనిసరి.

సరికొత్త కేటీఎం 250 డ్యూక్‌లో డ్యూయల్‌ ఛానల్‌ ఏబీఎస్‌ను అమర్చారు. గతంలో ది 390 డ్యూక్‌లో ఈ ఫీచర్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫీచర్‌ వల్ల  వెనుక చక్రానికి ఏబీఎస్‌ను కొద్దిసేపు నిలిపివేసే అవకాశం లభిస్తుంది. మిగిలిన ఫీచర్లు మొత్తం 2017 కేటీఎం 250 డ్యూక్‌లో ఉన్నవే కొనసాగిస్తున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.