close

తాజా వార్తలు

రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్లు కూడా:ఎయిర్‌టెల్‌

ముంబయి: మూలధన సమీకరణ నిమిత్తం భారతీ ఎయిర్‌టెల్‌ చేపట్టిన రూ.25వేల కోట్ల రైట్స్‌ ఇష్యూలో ప్రమోటర్లు కూడా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని భారతీ ఎయిర్‌టెల్‌ గురువారం వెల్లడించింది. ప్రమోటర్లు దాదాపు సగం వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఒక్కో షేరుకు రూ.220 చొప్పున చెల్లించనున్నారు. రూ.7వేల కోట్లను బాండ్స్‌ జారీ చేసి సమీకరించనున్నారు.

సింగపూర్‌కు చెందిన ప్రమోటర్‌ సింగ్‌టెల్‌ ఈ రైట్స్‌ ఇష్యూలో 170 మిలియన్ల షేర్లను కొనుగోలు చేయనుంది. సింగ్‌టెల్‌కు భారతీ గ్రూప్‌, భారతీ టెలికామ్‌లో ప్రధాన వాటాదారు. దీంతో దాదాపు 15 శాతం వాటా ఈ సంస్థకు దక్కనుంది. ఈ రైట్స్‌ ఇష్యూ తర్వాత సింగ్‌టెల్‌కు భారతీ ఎయిర్‌ టెల్‌లో 35.2శాతం వాటా ఉన్నట్లు అవుతుంది. దీంతో భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్‌టెల్‌ అతిపెద్ద వాటాదారుగా మిగులుతుంది.
 

Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.